కేరళలో ఈరోజు కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదు కాగా మరో  నలుగురు కరోనా బాధితులు కోలుకున్నారని  సీఎం విజయన్ ప్రకటించారు. ఈకొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా  కేసుల సంఖ్య 485కు చేరింది. అందులో 123 కేసులు యాక్టీవ్ లో ఉండగా 359మంది కోలుకున్నారు, ముగ్గురు మరణించారు. గత రెండు రోజుల నుండి కేరళలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరగగా ఈరోజు మాత్రం మళ్ళీ సింగల్ డిజిట్ కు చేరుకుంది. 

 
ఇక దేశ వ్యాప్తంగా మాత్రం కరోనా విజృంభిస్తుంది.  ముఖ్యంగా మహారాష్ట్ర ,ఢిల్లీలో  ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈఒక్క రోజే మహారాష్ట్ర వ్యాప్తంగా 500 కుపైగా కరోనా కేసులు నమోదు కాగా ఢిల్లీ లో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు తమిళనాడు లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా  అక్కడ 121 కేసులు నమోదు కాగా అందులో చెన్నై లోనే 101 కేసులు తేలడం గమనార్హం. ఓవరాల్ దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసులు సంఖ్య 30000కు చేరగా అందులో 900కుపైగా మరణాలు సంభవించాయి. ఇక మరో 5రోజుల్లో రెండో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది. అయితే కేసులు ఎక్కువవుతుండడం తో మరో సారి లాక్ డౌన్ పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: