ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అయితే రోజురోజుకు నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కర్నూలు జిల్లాలో ఎంతలా కరోనా వైరస్  ప్రభావం ఉంది అంటే భారీగా కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా  ఉన్న నగరాలలో దేశంలోనే  మొట్టమొదటి నగరంగా కర్నూలు అయింది అంటే అర్థం చేసుకోవచ్చు. కర్నూల్ లో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆ విధంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కేవలం రాష్ట్రం మొత్తంలో ఈ జిల్లాలోనే ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. 

 

 అయితే ఎందుకు కేవలం కర్నూలు జిల్లాలోనే అత్యంత దారుణ పరిస్థితి వచ్చింది అంటే... తబ్లిక్ జమాత్ సమావేశంనుంచి కర్నూల్ కి చాలామంది వచ్చారు. ఇక అక్కడ కర్నూల్ కి వచ్చిన వారికి కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి అటు పోలీసులు ఇటు అధికారులు మరోవైపు వైద్యులు ముందుకు వచ్చినప్పటికీ అధికార పార్టీ నాయకులతో పాటు అన్ని పార్టీల నాయకులు వారికి పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. మర్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన వారికి త్వరగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల నే కర్నూల్ లో ప్రస్తుతం సాధారణ క్లిష్ట  పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు

 


 అయితే కరోనా  వైరస్ విషయంలో కూడా ఎక్కడ బాధ్యతగా ఆలోచించకుండా ఓట్ల రాజకీయం చేశారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అధికార పార్టీ వాళ్లకు పేరు వస్తుందని ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీ వాళ్లకి పేరు వస్తుందని అధికార పార్టీ వాళ్లు.. మర్కజ్  సమావేశం నుంచి వచ్చిన వారిని  క్వారంటైన్  కు తరలించి పరీక్షలు చేయకుండా అడ్డుపడ్డారు. ఈ కారణంగానే అధికారులు కూడా ఆ ప్రాంతాల జోలికి వెళ్లడానికి వెనకాడరు. దీని ప్రభావం ప్రస్తుతం కర్నూలు జిల్లాలో క్రమక్రమంగా భారీగా కేసులు పెరిగిపోవడానికి కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ఓట్లతో గెలిచిన నాయకులు  ఆరోగ్యంతో ఆడుకున్నారు అన్నట్టు వంటి ఆంధ్ర ప్రజలు రగులుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: