అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచి చైనాపై ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ప్రబలినప్పటినుంచి అయితే ఆ విమర్శకులు మరింత పెరుగుతూ వచ్చింది. తాజాగా మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా  పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కరోనా  పరిస్థితుల నేపథ్యంలో చైనాకు చెందిన పలు కంపెనీలు వివిధ దేశాలకు విస్తరిస్తోన్నాయి . ఇదంతా ఒక ఎత్తయితే చైనా పైన ఆంక్షలు పెంచుకుంటూ వస్తుంది అమెరికా. అయితే తాజాగా డైరెక్టుగా చైనా పేరు చెప్పకుండా పలు విమర్శలు నిబంధనలు సూచించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 

 


 చైనా సైనిక్ ఉత్పత్తిలో నిబంధనలను  మరింత పెంచారు. పౌర వినియోగానికి వాడే ఎగుమతుల ఉత్పత్తిపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. మిస్టరీ ఉత్పత్తుల వినియోగానికి ఖచ్చితంగా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని... మిలటరీ లో వాడే వివిధ ఆయుధాలు సాంకేతికతను అనుమతి తీసుకోకుండా వేరే దేశాలకు  అమ్మితే  అంగీకరించేది లేదని లేనిపక్షంలో పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం చైనా రష్యా లాంటి దేశాలు ఆయుధాలను అమ్ముకుంటున్నాయి. 

 


 ప్రస్తుతం చైనా రష్యా వెనుజుల లాంటి దేశాలు ఆయుధాలు అమ్మి  బ్రతకడం అనేది ప్రధాన వనరుగా మారుతున్న నేపథ్యంలో తాజా నిబంధనల ఈ మూడు దేశాలకు  మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధాల అమ్మకానికి బ్రేక్ వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా మీద తనకున్న కోపాన్ని ఈ విధంగా తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి ఏం జరగబోతుంది అన్నది వేచి చూడాల్సిందే మరి.ఇక చైనా పై ఆగ్రహంతో ట్రంప్  మరెన్ని  కీలక నిర్ణయాలు తీసుకుంటారో అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: