మన ఇంట్లో నూనె, బియ్యం, కందిపప్పు వంటి అనేక నిత్యావసర వస్తువుల్లో అనేక రకాల క్వాలిటీ లు ఉంటాయి. వాటిల్లో మేలైన రకం వస్తువులు బాగా ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తే కొంచెం నాసిరకం వల్ల మనకు కావాల్సిన పౌష్టిక అవసరాలు తీరవు. అలాగే వైరస్ లలో కూడా అనేక రకాలు ఉంటాయి.

 

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లో దాదాపు 30 రకాల ఉండగా వాటిలో చైనా మరియు ఇటలీ దేశాలలో వ్యాప్తి చెందిన ఒక రకం వైరస్ ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇటలీ మరియు చైనా దేశాలే ప్రపంచంలో అటు మనుషుల ప్రాణాల పరంగా మరియు ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు అదే రకం వైరస్ మన భారతదేశంలో కూడా ఒక చోట విపరీతంగా వ్యాప్తి చెందుతోంది

 

చైనాలోని వుహాన్ లో జన్మించిన కరోనా మహమ్మారి తర్వాత 30 రకాల వైరస్ లుగా పరివర్తన చెంది ప్రపంచ వ్యాపితమైంది. వుహాన్ లో మొదలైన కరోనాను 'ఎల్' టైప్ వైరస్ గా గుర్తించారు. గుజరాత్ లో కరోనా ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం అది 'ఎల్' టైప్ వైరస్ అయ్యుండడమేనని నిపుణులు భావిస్తున్నారు.

 

వ్యాప్తిలో ఉన్న 'ఎస్' టైప్ కరోనా వైరస్ కంటే 'ఎల్' టైప్ కరోనా వైరస్ శక్తిమంతమైనదని తమ పరిశోధనల్లో గుర్తించామని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జీబీఆర్సీ) పరిశోధకులు చెబుతున్నారు. అలాగే కరోనా రోగుల మరణాల్లో కూడా అత్యధికంగా ఎల్ టైప్ వైరస్ లే ఎక్కువ సోకాయి అని డేటా ఉంది.

 

దీంతో కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. గుజరాత్ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో గుజరాత్‌లో 226 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మరణించారు. తాజా లెక్కలతో గుజరాత్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,774కు చేరింది. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 434 మంది కోలుకోగా.. 181 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: