ఆపదను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా...  ఏదోరకంగా ఆ సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగో బాబుకు బాగా తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ చేతులు ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తరువాత ఒక నెల రోజుల పాటు మౌనంగా ఉండిపోయారు. దీంతో పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తడంతో రంగంలోకి దిగిన బాబు పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహ పరిచే విధంగా అనేక కార్యక్రమాలు , ధర్నాలు, ప్రజాఉద్యమాలు, ఇలా అనేకం చేపట్టారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న, రాజధాని తరలింపు మూడు రాజధానులు వ్యవహారం తో టిడిపి మరింత జోష్ కనిపించింది. 

 
 
 
అయితే బాబు వయసు పెరిగిపోవడం, పార్టీ పై పట్టు కోల్పోవడం వంటి పరిణామాలతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ, పార్టీ క్రమశిక్షణ పూర్తిగా తప్పారు. దీంతో చంద్రబాబు పార్టీ పైన, పార్టీ నాయకుల పైన పట్టు కోల్పోయారనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. ఇక పార్టీ శ్రేణులను నిరుత్సాహం పెరిగిపోవడంతో చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నారు. ఇక ప్రతి ఏటా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న మహానాడును గతేడాది ఎన్నికల కారణంగా నిర్వహించలేదు. 
 
 
ఇక ఈ ఏడాది మహానాడు నిర్వహిస్తామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి దాని చంద్రబాబు ఆలోచన చేశారు. దీని కారణంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపి నట్లు అవుతుందని అంతా భావించారు కానీ  కరోనా కారణంగా మహానాడు జరిగే అవకాశాలు ఈ ఏడాది కూడా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: