కరోనా కష్టకాలంలో ఎన్నడు చూడని, వినని వింతలు లోకంలో జరుగుతున్నాయి.. ఒకరకంగా మనిషికి ఏవి కూడా అందుబాటులో లేకున్నా.. తాను చేయాలనుకున్న పనులు ఏవి ఆపడు అని నిరూపించబడింది.. అంతే కాకుండా ఇంట్లో నుండి కాలు బయటకు కదపకుండా బ్రతుకుతున్నాడు.. లోకం మొత్తం వైరస్‌తో అల్లాడిపోని.. ప్రపంచం మొత్తం మునిగిపోని నేను మాత్రం పెళ్లి చేసుకుంటా అని పట్టుబట్టి పెళ్లిలూ చేసుకుంటున్నారు..

 

 

నిజానికి లాక్‌డౌన్ వల్ల కష్టాలు ఎదురవుతున్నాయి.. నష్టాలు వస్తున్నాయి.. కొందరికి లాభం కూడా జరుగుతుంది.. ఇక వింతలకు అయితే కూడా కొదవ లేదు. ఈ సమయంలో జరగవలసిన పనులు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఇందుకు గాను ఆన్‌లైన్ ఎంతగానో ఊపయోగ పడుతుంది.. ఈ ఆన్‌లైన్‌ లోనే పుడ్ ఆర్డర్ చేయడం, మందులు, దైవదర్శనాలు, చెల్లించవలసిన లావాదేవీలు.. ఇలా మనిషికి అవసరమున్న ప్రతీది ఇప్పుడు ఆన్‌లైన్ ద్వార ఉపయోగించుకుంటున్నాడు.. మరీ ఆన్ లైన్ వేదికగా ఇన్ని పనులు సాగిపోతుండగా.. పెళ్లి మాత్రం జరగదా ఏంటి.. అదీకూడా చేసేసుకుంటున్నారు కొందరు.. కానీ కేరళలో.. ఒక యువకుడు మరో అడుగు ముందుకేసి ఆన్ లైన్ పెళ్లి జరిపించుకున్నాడు.

 

 

ఓసోస్.. కొత్తగా చెప్పేదేముంది.. అసలు ఇందులో వింతేముంది అని కంగారుపడి నోరు జారకండి.. ఎందుకంటే పెళ్లి ఎక్కడ జరిగిన తాళి మాత్రం పెళ్లికూతురు మెడలో, వరుడు కడితేనే దాన్ని పెళ్లి అంటారు కదా.. కానీ ఇక్కడ అబ్బాయి, ఫోన్లో పెళ్లికూతురిని చూస్తూ ఏకంగా ఆ ఫోన్ కే మూడు ముళ్లు వేసేశాడు. అంటే ఏకకాలంలో ఆమెను, ఫోన్ ను పెళ్లాడేశాడన్న మాట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ తతంగాన్ని చూసిన వారంత పెళ్లి సరే, శోభనం ఎలా అని చిలిపిగా ప్రశ్నిస్తుంటే, మనసుంటే మార్గముండదా అంటూ మరొకొందరు నర్మగర్భంగా, లేనిపోని కూతలు కూస్తున్నారు..

 

 

లాక్‌డౌన్ అయిపోయేదాక ఇతనికి పస్తూలే కావచ్చూ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.. ఏది ఏమైనా ఇతను అదృష్టవంతుడో, దురదృష్టవంతుడో మీరే చెప్పండి.. మరీ అతి కాకపోతే ఏంటండి.. లాక్‌డౌన్ ముగిసే వరకు ఆగితే సరిపోతుంది కదా.. ఇప్పటికిప్పుడే పెళ్ళి చేసుకుని సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో కదా... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: