వైర‌స్ సృష్టించింది చైనాయేన‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ‌రుస‌గా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు ఈ విష‌యంపై చైనా స్పందించించి. యూఎస్ అధికారిక వ‌ర్గాలు చైనాపై దుష్ర్ప‌చారం మొద‌లుపెట్టాయ‌ని ఎదురు దాడికి సిద్ధ‌మ‌వుతోంది. అమెరికాలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, అక్క‌డి జనాల‌ను దృష్టి మ‌ర‌ల్చేందుకే అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దేప‌దే చైనాను తిడుతూ..వైర‌స్ సృష్టించార‌ని చైనాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని  పేర్కొంది. మాన‌వ‌లోకానికి హాని త‌ల‌పెట్టే ప‌నిని చైనా ఏనాటికి చేయ‌ద‌ని, అలాంటి అవ‌స‌రం కూడా త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

 

‘ కొంత‌మంది అమెరికన్ల‌కు చైనా ఎదుగుద‌ల న‌చ్చ‌డం లేదు. చైనాను అన్ని రంగాల్లో నియంత్రిచండం వారి ల‌క్ష్యం. కాని అలాంటి వారికి మేం ఒక్క‌టే చెప్ప‌ద‌ల్చుకున్నాం. అదేమంటే..వారు ఎన్న‌టికి వారి ల‌క్ష్యాన్ని చేరుకోలేమ‌ని తెలుసుకోవాల‌ని. అయితే అమెరికాలో  కరోనా నియంత్ర‌ణ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకునేందుకు చైనా పేరును వాడుకుంటున్నార‌ని ’ అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ అన్నారు. అమెరికా రాజకీయ నాయకులు మొహమాటం లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరోప‌ణ‌లు చేసేవారు ఏ ఒక్క ఆధారం ఎందుకు చూప‌లేక‌పోతున్నార‌ని కూడా ప్ర‌శ్నించారు.


ఇదిలా ఉండ‌గా చైనాకు డబ్ల్యూహెచ్‌వో బాస‌ట‌గా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. చైనా ల్యాబుల్లో క‌రోనా వైర‌స్ త‌యారైంద‌ని ఎక్క‌డ ఆధారాలు ల‌భ్యం కాలేద‌ని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే అమెరికా అధికార వ‌ర్గాలు మాత్రం చైనాపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే వ‌స్తున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి మొదట చైనాలోని వుహాన్‌లో వెలుగుచూసింది. దానిని అంటువ్యాధిగా, మహమ్మారిగా గుర్తించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా కలిసి అలసత్వం వహించాయని అనుమానాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే అమెరికా సహా అనేక దేశాలు డ్రాగన్‌ దేశంపై గుర్రుగా ఉన్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. చాలా దేశాలు చైనాతో త‌మ చెలిమిని క‌ట్ చేసుకునేందుకే మొగ్గుం చూపుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: