మోసం ఎక్కడ చూడు ఇదే.. మనిషి తన నీడను తానే నమ్మాలంటే భయపడే రోజులు తలెత్తుతున్నాయి.. ప్రస్తుతం అడవి జంతువులతో కంటే సమాజంలో ఉన్న మనుషులతోనే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే దాదాపుగా మేకతోలు కప్పుకున్న తోడేళ్లు ఈ సమాజంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. అవి అవసరాన్ని బట్టి తమ స్వరూపాలను మార్చుకుంటాయి.. మాయ మాటలతో నమ్మక ద్రోహం చేస్తాయి.. ఏమాత్రం అదమరచి ఉన్నామో ఇక అంతా మాయమే.. ఇప్పటికే సమాజంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. వీరికి తోడుగా మాటల మాయగాళ్లు తయారైయ్యారు.. అందుకు ఉదాహరణగా లక్షలతో వస్తున్న ఓ వ్యక్తిని మాయచేసి ఆ డబ్బులతో ఉడాయించిన లారీ డ్రైవర్ ఉదంతమే నిదర్శనం..

 

 

ఆ వివరాలు తెలుసుకుంటే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఓ ఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ రాజేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి పీవీఎల్‌ చిల్లీస్‌ ట్రేడర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్‌ మార్కెట్‌లో ఈ నెల 26న తమ సంస్ద తరపున ఉన్న 10 టన్నుల సరుకును అమ్మగా బకాయిలతో కలిపి రూ.71 లక్షలపైగా వచ్చాయి. ఆ పైకాన్ని తీసుకుని ఈ మార్కెట్‌ నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి వస్తున్న లారీలో తిరుగు ప్రయాణమయ్యాడు.. ఇద్దరు ఒకే చోటికి వెళ్లాలి కాబట్టి ఆ లారీడ్రైవర్, ఏడుకొండలు ఏదో పిచ్చాపాటిగా ముచ్చట్లు చెప్పుకుంటు తమ ప్రయాణాని సాగిస్తున్నారు..

 

 

ఈ క్రమంలో ఏడుకొండలు మాట్లాడే మాటలను బట్టి ఆ లారీ డ్రైవర్ అతనివద్ద భారీ నగదు ఉన్నట్లు పసిగట్టాడు. అంతలో అతనిలో ఉన్న మృగం నిదురలేచింది.. ఆ సొమ్ముపై కన్నువేసి దాన్ని ఎలాగైనా కాజేయాలనే నెపంతో అబ్దుల్‌ హసీబ్ అయిన అతని పేరును దాచి తనను తాను ఆసీఫ్‌గా చెప్పుకున్నాడు.. ఇంతలో ఆ లారీ పటాన్‌చెరు వద్ద ఔటర్‌ రోడ్డు పైకి రాగానే ఇంజన్‌లో లోపం ఉందంటూ లారీని ఆపేశాడు. తాను చేక్ చేస్తున్నట్లుగా నటిస్తూ, ఏడుకొండలును కూడా సహాయంగా పిలిచాడు..

 

 

అప్పటికే చీకటిపడటంతో అక్కడ ఏం కనిపించడం లేదు.. దీంతో ఏడుకొండలు వెలుతురు కోసమంటూ సెల్‌ఫోన్‌ తీసుకుని లైట్ ఆన్ చేసేలోపలే, ఆ లారీ డ్రైవర్ హఠాత్తుగా లారీ ఎక్కి నగదుతో పరారయ్యాడు. విషయాన్ని గ్రహించేలోపే అతను తుర్రుమన్నాడు.. ఇక ఆ బాధితుడు టోల్‌గేట్‌ వద్దకు వచ్చి పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ నరేష్‌ గాలింపు చేపట్టారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: