క‌రోనా రోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఇక‌పై క‌రోనా వ‌స్తే ఎవ‌రైనా చికిత్స కోసం హాస్ప‌టల్స్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. రోజుల త‌ర‌బ‌డి ఇళ్ల‌ల్లో కూడా ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా వారు ఇళ్ల‌ల్లోనే ఉండి చికిత్స చేసుకునే ఛాన్స్ కేంద్రం క‌ల్పించింది. ఇక ఇంట్లోనే ఉండి వైద్యుల సూచ‌నల మేర‌కు చికిత్స తీసుకునే వారు ముందుగా స్వీయ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.

 

ఇంట్లోనే ఉంటూ క‌రోనాకు వైద్యం తీసుకునే వారు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు ఆ రోగి ఇంట్లో ఇలాంటి సౌక‌ర్యాలు ఉండాలి....

- రోగి ఎప్పుడూ కూడా ట్రిఫుల్ లేయ‌ర్ మెడిక‌ల్ మాస్క్ మాత్ర‌మే వాడాలి.. 8 గంట‌లు వాడాక దానిని మార్చాలి.. లేదా ఆ మాస్క్‌కు త‌డి లేదా మురికి అంటితే దానిని వెంట‌నే తీసేయాలి.

- రోగులు వాడే మాస్‌ను సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని పారేయాలి. 

- కరోనా రోగులు త‌ప్ప‌నిస‌రిగా ఇత‌ర వ్య‌క్తుల‌తో దూరం పాటించాలి

- క‌రోనా రోగులు వృద్ధులు, బీపీ, షుగర్, గుండె, మూత్రపిండ వ్యాధులు ఇతరత్రా అనారోగ్యంగా ఉన్న వారికి దగ్గరగా ఉండకూడదు.

 

- క‌రోనా రోగి త‌ప్ప‌నిస‌రిగా విశ్రాంతి తీసుకోవాలి. నీరు, పళ్ల రసాలు తాగాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవాలి.

- క‌రోనా రోగి స‌బ్బు నీటితో చేతిని క‌నీసం 40 సెక‌న్ల పాటు క‌డుక్కోవాలి.. లేదా ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

- వ్యక్తిగత వస్తువులను ఇతర వ్యక్తులతో పంచుకోవద్దు. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను, మందులను, తలుపు హ్యాండిళ్లను హైపోక్లోరైట్‌ ద్రావణంతో కడగాలి.

- ఇక క‌రోనా రోగులు ఎప్పుడూ కూడా వైద్యుడి సూచనల మేరకు మందులు వాడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: