లాక్ డౌన్ కొనసాగించాలా లేదంటే ఎత్తివేయాలా అన్న ఆలోచనలలో ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తుంటే వారి ఆలోచనలకు శ్రామికులు ఇవ్వబోతున్న షాక్ ఇప్పుడు భారత ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దేబ్బతీయబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసినా తాము మరో ఆరు నెలల వరకు పనులలోకి రామని అని అనేకమంది శ్రామికులు ఇస్తున్న సంకేతాలతో పరిశ్రమలు హోటల్స్ తిరిగి ప్రారంభించినా పనిచేసే వ్యక్తులు ఉండరు అంటూ వస్తున్న అధ్యయనాలు ప్రభుత్వాలను కలవర పెడుతున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ ఎత్తివేసినా పనిలోకి వచ్చే శ్రామికులు ఎవరు అంటూ ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. అంతేకాదు లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత తాము ఒక్కక్షణం కూడ నగరాలలో ఉండమని తాము తమ ఊళ్ళకు వెళ్ళిపోతామని కోట్లాది మంది శ్రామికులు ఇస్తున్న హెచ్చరికల మధ్య కరోనా సమస్య పై పరిష్కారాలు లేక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. 


ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన పల్లెలలో అనుసరిస్తున్న పద్ధతులు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఏఊరుకి ఆఊరు కంచెలు వేసుకుని బయటపారిని లోపలకు రాకుండా జీవనం గడుపుతున్న అనేక పల్లెలలో మరొక కొత్త సంస్కృతి బయలుదేరింది. కేరళాలోని మలప్పురం జిల్లాలోని థజి క్కోడి గ్రామ పంచాయితీ పెద్దలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కొత్త ఆలోచనలు ఆచరిస్తున్నారు. 


ఈ లాక్ డౌన్ కాలం ముగిసే వరకు తమ గ్రామంలోని ప్రజలలో ఎవరు ఖచ్చితంగా తమ ఇళ్ళలోంచి బయటకు రాకుండా ఉంటే వారికి ఓదార్పు బహుమతులు ఇవ్వబోతున్నారు. ఈ బహుమతుల లిస్టులో ‘బంగారం – ఫ్రిజ్ – వాషింగ్ మిషన్’ లతో పాటు ఇంకా అనేక బహుమతులు ఉన్నాయి. ఈ బహుమతుల మొత్తం ఖర్చును గ్రామపంచాయితీ నిధుల నుండి కుదరకపోతే ఆఊరి గ్రామ సర్పంచ్ స్పాన్సర్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ కరోనా బహుమతుల పధకం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో ఈవార్త ప్రస్తుతం మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. ఈస్కీమ్ విజయవంతం అయితే భవిష్యత్ లో ఈ స్కీమ్ ను కరోనా బాధిత రెడ్ జోన్స్ అన్నింటిలోను అమలు చేస్తే చాల త్వరగా కరోనా ను మనదేశం నుండి తరిమేయవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: