ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు బాగా రెచ్చిపోతున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల విషయంలో ఎంత అవగాహన పెంచుకున్నప్పడికి  రోజు  రోజుకు ఎదో ఒక  విధంగా ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక సైబర్ సైబర్ నేరగాళ్ల బారినపడి ఎంతోమంది ఖాతాలను గుల్ల చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి. పోలీసులు ప్రజలకు ఎన్ని సార్లు అవగాహన కల్పించిన... ప్రజలు సైబర్ నేరగాళ్ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. దీంతో సరి కొత్తగా ఆలోచిస్తున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది అని చెప్పాలి. 

 

 

 ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మెసేజింగ్  యాప్లలో కొన్ని మెసేజ్ లు  తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదో ఒక నెట్వర్క్ నుంచి ఫ్రీ డాటా ఇస్తున్నారని ఈ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి అంటూ ఉన్న ఓ మెసేజ్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది . ఇక డాటా  కోసం కక్కుర్తి పడి చాలా మంది జనాలు ఆ లింకును ఓపెన్ చేసి రిజిస్టర్  చేసుకోవడంతో సైబర్ నేరగాళ్ల చేతిలోకి పర్సనల్ డీటెయిల్స్  వెళ్ళిపోయి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇక మోసపోయిన జనాలు చేసేదేమీ లేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా రోజురోజుకు సైబర్ నేరగాళ్ల బెడద పెరిగి పోతూనే ఉంది.

 

 

 ఇక తాజాగా ఇలాంటి ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోతోంది. జియో కంపెనీ మీకు నెలకు 25 జీబీ డేటాను ఆరునెలలపాటు అందిస్తుంది అంటూ కొందరికి మెసేజ్లు వస్తున్నాయి. ఫేస్బుక్ కంపెనీ జియో లో పెట్టుబడులు పెట్టిన కారణంగా అందరికీ ఈ ఆఫర్ లు ఇస్తున్నట్లుగా ఆ మెసేజ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ మెసేజ్ లో లింక్ కూడా ఉంటుంది. ఆ లింకు ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చూపిస్తోంది. సరే ఫ్రీ డేటా ఇస్తామంటున్నారు కదా అని ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు మీరు పంగనామాలు పెట్టుకున్నట్లే. ఎందుకంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు అని కాళీ అయిపోతాయి. అందుకే ఇలాంటి మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: