ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలో లాక్ డౌన్ పొడ‌గిస్తారా?  లేదా నిర్దేశిత మే 3తో ముగిసిపోనుందా? అనే ఆస‌క్తి, ఉత్కంఠ‌, టెన్ష‌న్‌. మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేస్తుందా? లేక వైరస్‌ ప్రభావం లేని గ్రీన్‌ జోన్ల వరకే సడలింపులను పరిమితం చేస్తుందా? అనే ఉత్కంఠ అన్ని వ‌ర్గాల్లోనూ వ్య‌క్త‌మవుతోంది. ఇదే స‌మ‌యంలో ఇప్పటికే పలు రాష్ర్టాలు ఆంక్షల్లో సడలింపులనిచ్చాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేయడానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం ప్రతిపాదించే ఎగ్జిట్‌ ప్లాన్‌ ఏమిటో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

 


కాగా, మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేస్తుందా? లేక వైరస్‌ ప్రభావం లేని గ్రీన్‌ జోన్ల వరకే సడలింపులను పరిమితం చేస్తుందా? అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది. దేశంలో ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ చేసిన ఈ ప్రతిపాదనపై ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. హాట్‌స్పాట్లు పెరుగుతున్న దశలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సబబు కాదని కొందరు ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేయగా, కేంద్రం సూచించిన సడలింపులను అమలుచేస్తామని మరికొందరు ముఖ్య‌మంత్రులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు. 

 

ఇదే స‌మ‌యంలో కొన్ని రాష్ట్రాలు నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. తమ రాష్ట్రంలోకి ప్రవేశించే ఎవరైనా ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, వైరస్‌ సోకలేదన్న సర్టిఫికెట్‌ను చూపిస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకే సముదాయంగా లేని దుకాణాలను తెరిచేందుకు అసోం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్‌లో కొన్ని పాక్షిక సడలింపులను ప్రకటిస్తున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు , కార్పెంటర్లు, మోటరు మెకానిక్‌లు తమ సేవల్ని కొనసాగించవచ్చని తెలిపింది. మొబైల్‌ రీచార్జీ, స్టేషనరీ, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ తదితర దుకాణాలకు సడలింపులనిస్తున్నట్టు రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా దేశంలోని పలు రాష్ర్టాలు తమ పరిధిమేరకు ఆంక్షల్ని సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలకు అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇదే సమయంలో బయటి వ్యక్తులు తమ రాష్ర్టాలకు రాకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: