నిద్రించే స‌మ‌యంలో కొంత మంది బ‌ట్ట‌లు లేకుండా ప‌డుకుంటే...మ‌రికొంత మంది లోదుస్తుల్లో ప‌డుకుంటారు. అలా ప‌డుకోవ‌డం వ‌ల్ల చాలా లాభాలున్నాయంటున్నారు ప‌రిశోధ‌కులు. ఇక మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే నిద్ర పోయే స‌మ‌యంలో బ్రా ధ‌రించ‌డం వ‌ల్ల రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. లేదా బ్రా బిగుతుగా ఉన్నార‌క్త ప్ర‌స‌ర‌ణ అనేది స‌రిగ్గా జ‌ర‌గ‌దంటున్నారు. అంతేకాక దీనివ‌ల్ల హైప‌ర్ పిగ్మెంటేష‌న్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయంటున్నారు. బిగుతుగా ఉండే బ్రాలు చ‌ర్మానికి ఒరుసుకుపోయి హాని క‌లిగిస్తుంది. ఒక్కోసారి అక్క‌డ స్కిన్ ఎల‌ర్జీ కూడా వ‌చ్చే ప్ర‌మాదం చాలా ఉంది. 

 

ఇక బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించినప్పుడల్లా పురుల‌కు మాత్రం వారి పర్సనల్ పార్ట్స్ దగ్గర వేడి పెరుగుతుంది. అలా వేడి పెర‌గ‌డం వ‌ల్ల వీర్యకణాల్లో సమస్య వస్తుంది.. దాని వ‌ల్ల ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీర్యకణాలలోని డీఎన్‌యే సరిగ్గా ఉండదు. ఇక దుస్తులు లేకుండా నిద్ర లేచిన వారి పనితీరు బాగుంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను మెదడు తొలగిస్తుంది. మనిషి మెలకువగా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియల వల్ల ఏర్పడేవే ఈ వ్యర్ధాలు. ఈ శుభ్రపరిచే ప్రక్రియ మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళిన తరువాతే మొదలవుతోంది. 

 

దుస్తులు ఎక్కువగా ధరించి శరీరానికి వేడి పెంచితే కార్టిసోల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దానివల్ల జరిగే కొన్ని నష్టాలు జరుగుతాయి. అవేంటంటే.. శరీరంపై ఏవైనా గాయాలు అయితే.. ఆలస్యంగా తగ్గుతాయి, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది, అలాగే రక్తపోటు పెరుగుతుంది - ఇవి కార్టిసోల్ పెరగడం వల్ల జరిగే నష్టాల‌ని వైద్య నిపుణులు  చెబుతున్నారు. కార్టిసోల్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే దుస్తులు లేకుండా నిద్రించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 

దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఆత్మ విశ్వాసం కూడా  పెరుగుతుంద‌ట అంటేకాక‌ ఉల్లాసంగా, ఉత్సాహంగా నిద్ర లేస్తారంట‌. అతి తక్కువ దుస్తులతో నిద్రించడం వల్ల శరీరం ఊపిరి పీల్చుకుంటుంది. రోజంతా దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచుతాయి. కాబట్టి దుస్తులు తీసెయ్యడం వల్ల, సున్నితమైన ప్రదేశాలు కాస్త గాలిని గ్రహించటానికి వీలవుతుంది. దీని వల్ల చర్మ సంబంధమైన సమస్యలు కూడా మీ ద‌రి చేర‌వు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: