బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో నిన్న హాస్పిటల్లో జాయిన్ అయినా సంగితి తెలిసిందే. అయితే పరిస్థితి విషమించడంతో నేడు ఆయన కన్నుమూశారు. ఆయనకు పెద్దపేగు సంబంధిత వ్యాధికి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం మరణించారు. కాకపోతే అతను చనిపోయాడంటూ వచ్చిన కథనాలను ఇర్ఫాన్‌ ఖాన్ కుటుంబ సభ్యులు, బంధువులు తోసిపుచ్చారు. 


కాకపోతే ఈరోజు ఉద్యం ఆయన మరణించారు. ఆయన మృతికి అనేకమంది సోనం కపూర్, అరవింద్ కేజ్రీవాల్, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియచేసారు. ఇక ఇర్ఫాన్ ఖాన్ ఇంట్లో వరుస మరణాలు ఆయన బంధువులను, అభిమానులకు కాసింత షాక్ కు గురి చేసాయని చెప్పవచ్చు. అయితే ఇర్ఫాన్ తల్లి సైదా బేగం కూడా గత శనివారం మృతి చెందిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అటు లాక్‌డౌన్ ‌ఉండడంతో వీడియో కాన్ఫరెన్స్ ‌లోనే తన తల్లిని కడసారి చూసుకున్నాడు ఇర్ఫాన్ ఖాన్. 

 

ఇక ఇది ఇలా వుండగా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ మధ్య కాలంలోనే కోలుకున్నారు. అయితే తన ఈ విషాద వార్త బయటకు వచ్చింది. ఇర్ఫాన్ ఖాన్‌ తల్లి 95 ఏళ్ళ సైదా బేగం కూడా కాస్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె తన స్వగృహంలో ఆవిడ తుది శ్వాసను వదిలారు. అయితే నవాబుల కుటుంబానికి చెందిన ఆమె జైపూర్ ‌లోని బెనివల్ ‌కంత కృష్ణ కాలనీలో జీవం కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అతను తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయాడు. దీనితో కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లిని కడసారి కళ్లారా చూసుకొని నివాళులు అర్పించాడు ఆయన. కాకపోతే, తన తల్లి అంత్యక్రియలు జరిగిన కేవలం నాలుగు రోజులకే ఇర్ఫాన్ ఖాన్ మరణం విషాదాన్ని నింపింది. దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర మానస్థాపనికి లోనయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: