దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. మరి మే 3వ తేదీ తరువాత పరిస్థితేమిటి...? అనే ప్రశ్నకు మే 3 తరువాత కూడా లాక్ డౌన్ ను పొడిగించటానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. మరో రెండు, మూడు వారాలు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని సమాచారం. 
 
లాక్ డౌన్ వల్ల ప్రజా రవాణా సైతం స్తంభించిపోయింది. లాక్ డౌన్ తర్వాత రైల్వే శాఖ నిబంధనలలో భారీగా మార్పులు చేయనుందని తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత రైలు ఎక్కాలంటే రైల్వే స్టేషన్ కు రెండు గంటల ముందు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు మాస్కు ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుంది. వారికి పరీక్షలు చేసి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేకపోతే మాత్రమే రైళ్లలోకి అనుమతించనున్నారు. 
 
ప్రయాణికులు బుకింగ్ కౌంటర్ దగ్గర టికెట్ కొనుగోలు చేసే సమయంలో వ్యక్తిగత దూరం పాటించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనుంది. మే 3వ తేదీ తరువాత కూడా రైళ్లు తిరిగే అవకాశం లేదని సమాచారం. మే 3 తరువాత కూడా విమానాలు, బస్సులపై ఆంక్షలు కొనసాగనున్నాయని సమాచారం. 
 
కేంద్రం మే 3వ తేదీ తరువాతైనా ప్రజారవాణాపై ఆంక్షలు సడలిస్తుందని చాలా మంది భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా ప్రజారవాణాపై ఆంక్షలు కొనసాగనున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తోంటే మరో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఏపీలో ఈరోజు 73 కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1332కు చేరింది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: