ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో  భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించి ప్రజలను ఇంటికే పరిమితం కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లుగానే కరోనా  వైరస్ కట్టడి క్రమక్రమంగా సాధ్యం అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే లాక్ డౌన్  పొడగింపు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకూ కొనసాగనుంది.  ఆ తర్వాత కూడా మళ్లీ పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. 

 

 

 ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా నగరాలు పట్టణాల్లో అవసరాలను అంద చేస్తుండగా... ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే డోర్ డెలివరీ ద్వారా నిత్యావసరాలను పొందుతున్నారు. ఎక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం నిత్యావసర సరుకుల రవాణా కష్టతరమవుతుంది. ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు గ్రామాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఇప్పుడు వరకు సిద్ధం కాలేదు. 

 

 

 దీంతో లాక్ డౌన్ సమయంలో  గ్రామాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా  దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ కామర్స్ సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగరంలో లాగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేవలు నడుపుతున్నట్లు సమాచారం. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ ఆర్దర్ లను  కూడా సేకరించి సరుకులను గ్రామాల్లోని వినియోగదారులకు నేరుగా ఇంటికే పంపించే విధంగా వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. దీనికోసం గ్రామస్థాయి ఆన్లైన్ రిటైల్ చైన్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.దీనికి  సంబంధించిన ప్రణాళికను కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా  అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: