దేశ ప్రజలందరికీ భయం గుప్పిట్లో కి నెడుతున్న  కరోనా  వైరస్ ఈ మధ్య కాలంలో మరింత భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సాధారణ ప్రజలను కాదు డాక్టర్లను అధికారులను సైతం భయాందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే మొన్నటివరకు కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి ని క్వారంటైన్ కి  తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ బాడీలో ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు మాత్రం కనిపించడం లేదు చాలా మందికి. దీంతో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడం కష్టతరమవుతుంది . ఇక్కడ 90 ఏళ్ల ముసలామె కు కూడా కరోనా  వైరస్ బారిన పడింది. ఇక మామూలుగానే 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు మహమ్మారి వైరస్ బారిన పడ్డారంటే వారిని రక్షించడం డాక్టర్లకు కూడా పెద్ద సవాలే అనే విషయం తెలిసిందే. 

 

 

 అయితే డాక్టర్లు ఏప్రిల్ 5వ తేదీన 90 ఏళ్ల భామ ను  ఆస్పత్రిలో చేర్చారు . ఇక 14 రోజుల తర్వాత ఆమెకు ఓసారి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. వృద్ధురాలు కాబట్టి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా  వయస్సు ఇంకా బాడీలోని ఉండిపోయిందని అనుకున్నారు వైద్యుడు. ఇక ఆ తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి టెస్టులు చేయసాగారు వైద్యుడు. అయితే ఏకంగా ఇలా 10 సార్లు టెస్టులు చేశారు అక్కడి వైద్యులు. పదవ సారి కూడా సదరు 90 ఏళ్ల బామ్మకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇక ఆమె బతకడం కష్టమే అని బంధువులు కూడా ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఒక డౌట్ ఎన్నిసార్లు పాసిటివ్  వచ్చిన సదరు బామ్మ మాత్రం ఆరోగ్యంగానే ఉంది అంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం కారణంగా కరోనా వైరస్ తో పోరాడుతుంది అని భావించి ఓ  ఆశ చిగురించింది. 

 

 

వారు అనుకున్నట్లుగానే  90 ఏళ్ల బామ్మ కరోనా ను జయించింది.   11వ సారి టెస్టులు నిర్వహించగా  నెగిటివ్ అని వచ్చింది. దీంతో డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యుల్లో  ఆనందం నిండిపోయింది. అయితే 65 ఏళ్లు దాటితే బతకడం కష్టమే అని  నిపుణులు చెబుతుంటే  90 ఏళ్ల బామ్మ ఇలా  కరోనా వైరస్  జయించింది అని డాక్టర్లు ఆశ్చర్యపోయారు.ఈ ఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: