మనకు చెవిలోకి చీమ వెళ్లిన సరే.. నొప్పి నొప్పి అని ఇల్లంతా అల్లరల్లరి చేస్తాం.. కానీ చైనాలో ఉన్న ఓ మహిళ చెవిలో సాలీడు పురుగు ఏకంగా గూడు కట్టేసింది.. అయినా సరే ఆమెకు నొప్పి అనిపించలేదు.. ఇష్టం వచ్చినన్ని రోజులు ఆమె చెవిలో డ్యాన్స్ చేసింది.. అయినా ఆమెకు ఎటువంటి స్పర్శ లేదు..     

 

కానీ ఆమెకు ఉన్నట్టుండి చెవిలో ఏదో కదిలినట్టు.. ఏదో శబ్దం వినిపించినట్టు.. దురద పెట్టినట్టు ఆమెకు అనిపించింది.. దీంతో ఆమె చైనాలోని మియాన్యాంగ్ హాస్పిటల్‌కు వెళ్లింది.. అక్కడికి వెళ్లి చెవిలో దురద పెట్టినట్టు అనిపిస్తుంది అని ఆమె డాక్టర్ కి చెప్పింది.. ఇంకా ఆమె చెవిలో టార్చ్ వేసి పరీక్షించగా ఏదో ఉండలాంటి ఉంది అని.. అది దూది అయి ఉండొచ్చు అని అన్నారు.         

 

దీంతో వెంటనే ఓటోస్కోపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఇంకా ఆమె చెవికి వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె చెవిలో తెల్లని పదార్ధం ఉంది అని అది దూది కాదు అని సాలిడ్ అని కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో దాన్ని బయటకు రప్పించేందుకు చెవిలో కెమికల్ డ్రాప్ వేసి సాలిడ్ ని బయటకు పంపారు.         

 

అనంతరం ఆమె చెవిని వైద్యులు శుభ్రం చేసి పంపారు.. అయితే ఈగలు.. చీమలు దురితేనే అదోలా అనిపిస్తుంది.. అలాంటి ఏకంగా సాలీడు దూరి చెవిలో గూడు కట్టిన ఆమెకు ఎటువంటి స్పర్శ లేకపోవడం ఏంటి ? మనిషేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంకా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.              

 

మరింత సమాచారం తెలుసుకోండి: