అయిపోయింది ... అంతా అయిపోయింది. పచ్చళ్ళు అమ్ముకుని పైకొచ్చిన రామోజీ రావు మననసపుత్రిక ఈనాడు కి ఇప్పుడు ఎడాపెడా సెగ తగిలేసింది గిలగిలలాడిపోతోంది. అసలు ఈనాడు అంటే ప్రభుత్వ ఉద్యోగం లెక్క. జీతాల విషయంలోనూ, ఉద్యోగస్తుల సంక్షేమం విషయంలోనూ అబ్బో ఈనాడు ని మించిన మీడియా మరోటి లేదు. అసలు ఈనాడు అంటే ఈనాడే. రామోజీ లెక్క అంటే లెక్క. ఆ సంస్థ ఉద్యోగస్తులకు దేవుడిలా కనిపించేవారు. అయితే ఇప్పుడు అదంతా తారుమారయిపోయింది. ఈనాడూ... నేను కూడా ఆ తానులో ముక్కను అన్నట్టుగా మిగతా పత్రికల జాబితాలో చేరిపోయింది. అసలు ఎప్పటి నుంచో ఈనాడు ఉద్యోగాల్లో ఎడా పెడా కోతలు పెట్టేద్దామని చూస్తున్న ఈనాడుకు ఇప్పుడు కరోనా భలేగా కలిసొచ్చింది. ఉద్యోగాల కొత్త సంగతి పక్కనపెడితే ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెల్చేయ్యడమే అతి పెద్ద సంక్షోభంగా ఇప్పుడు కనిపిస్తోంది. 

 

IHG

అసలు ఈనాడు అంటే ప్రతి విషయంలోనూ పక్కాగా, ఒక క్లారిటీతో ఉంటుంది. అటువంటి సంస్థలో ఇప్పుడు జీతాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే నెలాఖరు వచ్చింది. కొత్త నెల కూడా ప్రారంభం కాబోతుంది. దీంతో యధాతధంగా జీతాలు చెల్లిస్తారా అనే చర్చ ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో మొదలైంది. ఎందుకంటే చాలా మీడియేతర సంస్థలు తమ ఉద్యోగులకు కరోనా వ్యవహారం ముగిసే వరకు జీతాల గురించి ఎవరు అడగవద్దని చెప్పేసాయి. ఇక మీడియా విషయానికి వస్తే కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు, ఉద్యోగాలు కత్తిరించడం స్టార్ట్ అయ్యాయి. దీంతో జర్నలిస్టు సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే వరకు వ్యవహారం వెళ్లింది. ది హిందూ పత్రిక కూడా ఈ జీతాల తగ్గట్టుగానే తగిలింది. అలాగే హిందుస్థాన్ టైమ్స్ కూడా 10 నుంచి 30 శాతం వరకు ఉద్యోగులు జీతాల్లో కోత ఉంటుందని ప్రకటించేసింది. ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి జీతాల్లో కోత ఉంటుందని ప్రకటించాయి. 

 

ఇక డెక్కన్ క్రానికల్ అయితే 10 నుంచి 15 వేల వరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిందట. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక గత నెల నుంచి ఉద్యోగుల జీతల్లో కోతలు మొదలు పెట్టేసింది. నమస్తే తెలంగాణ పత్రిక ఉద్యోగుల జీతాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎటువంటి కోతలు పెట్టలేదు. అలాగే సాక్షి కూడా గత నెల మొత్తం వేతనాలు చెల్లించింది. అయితే ఈనాడు మాత్రం పత్రిక స్థాపించిన ఇన్నేళ్లలో మొదటిసారిగా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదని, పదో తారీఖున ఇవ్వబోతున్నట్లు మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. 

 

ఈనాడు దినపత్రిక విషయంలో పెద్దగా ఆసక్తిగా లేదు. డిజిటలైజేషన్ కు మారిపోదామనే ఆలోచనలో ఉంది. దానిలో భాగంగానే ఈటీవీ భారత్ అనే యాప్ ను ప్రమోట్ చేస్తున్న ఈనాడు ఆ యాప్ ను ప్రజల చేత డౌన్లోడ్ చేయించే బాధ్యతను ఈనాడు కంట్రిబ్యూటర్ లకు అప్పగించింది. ఒక యాప్ ను డౌన్లోడ్ చేయించినందుకు 10  రూపాయల కమిషన్ కూడా ఇస్తామని ప్రకటించింది. తీరా కంటిబ్యూటర్ లు తమ టార్గెట్ పూర్తి చేసిన తర్వాత సగం అంటే ఐదు రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. ఇక ఇప్పుడు జీతాల విషయంలోనూ ఇదే విధంగా ఈనాడు వ్యవహరిస్తోంది. పదో తేదీన ఉద్యోగస్తులకు మొత్తం జీతం చెల్లిస్తారా ? లేక సగం కోత విధిస్తారా అనే ఉత్కంఠ ఈనాడు ఉద్యోగస్తులను వేధిస్తోంది. 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: