ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి 60కు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడానికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కరోనా కట్టడి కావడం లేదు. 
 
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోంది. గత నెల 1000 రూపాయలు తెల్ల రేషన్ కార్డుదారులకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసిన ప్రభుత్వం, సున్నా వడ్డీల డబ్బులను విడుదల చేసి డ్వాక్రా మహిళలకు, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయడం ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. 
 
రేషన్ బియ్యం, కంది బేడలు ఉచితంగా మూడుసార్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. పార్టీ నేతల వల్లే వైరస్ కొంత వ్యాప్తి చెందిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భారీ ర్యాలీ చేసిన తరువాత అక్కడ కేసులు పెరగడం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఘటన, రోజా ఘటన, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగిన సభలు, సమావేశాలు కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
జగన్ నుంచి కొందరు వైసీపీ నేతలకు సీరియస్ హెచ్చరికలు వెళ్లాయని సమాచారం. అందువల్ల గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో వైసీపీ నేతలు సైలెంట్ గానే ఉన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వానికి విమర్శలు తెచ్చిపెట్టే పనులు చేయవద్దని సూచించింది. ప్రభుత్వానికి విమర్శలు తెచ్చేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.    

మరింత సమాచారం తెలుసుకోండి: