కరోనా వైరస్ వాస్తవానికి చైనాలో మొదలైనా.. ఆ దేశం కంటే మిగతా దేశాల్లో చాల వేగంగా వ్యాపించింది.. ఇప్పటికి కూడా ఒక చైనా తప్పా మిగతా దేశాల్లో కంట్రోల్లోకి రాలేకపోతుంది.. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం మెత్తం ఆర్ధికంగా చాలా వెనక్కు వెళ్లిపోయింది.. అదీగాక మనుషుల జీవన విధానాల్లో ఎన్నో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇప్పుడు డబ్బున్న వారు మాత్రమే దర్జాగా బ్రతుకుతుండగా.. పేదవారు మాత్రం ఆకలికి అలమటిస్తున్నారు.. దీని దెబ్బకు ముందు ముందు పరిస్దితులు ఎంత దారుణంగా మారుతాయో ఊహించడం కష్టమే అవుతుంది..

 

 

ఇకపోతే ఈ వైరస్ మూలంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ అయింది.. అయినా కానీ వచ్చే రోగం వస్తూనే ఉంది.. ఒక వైపు కఠిన నిబంధనలు అమలవుతున్నా.. ఈ కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు.. అదీగాక ఈ వైరస్ ఇప్పట్లో తగ్గేలా లేదని ఆరోగ్య సంస్దలు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.. ఇకపోతే లోకం మొత్తం చుట్టేసిన కరోనా వల్ల ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3 మిలియన్ల మంది ఈ వైరస్ బారినపడ్డారట. దాదాపుగా 2.18 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారట. నిజానికి ఇది ఈ కలికాలంలో జరిగిన మహా విపత్తుగా చెప్పవచ్చూ.. అయితే ఇప్పటివరకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కరోనా అసలే లేదు.. మరికొన్ని చోట్ల తగ్గుముఖం పడుతుంది.. కాగా ఈ కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మొదటి 10 దేశాలను గమనిస్తే..

 

 

మొదటగా చెప్పుకోవలసింది ప్రపంచానికి పెద్దన్న అయినా అమెరికా గురించే.. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోకెల్లా అమెరికా పైనే కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం వరకు 10.35లక్షల మంది దాకా ఈ వైరస్ బారినపడగా, సుమారుగా 59 వేలకు పైగా ప్రజలు మరణించారు. ఆ తర్వాతి స్దానాన్ని స్పెయిన్ దక్కించుకుంది.. ఈ దేశంలో 2.32లక్షల కేసులు నమోదవగా.. 23.8వేల మంది మృతి చెందారు.. ఇకపోతే మూడోవ స్దానంలో ఇటలీ నిలిచింది.. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 20.1 లక్షలు.. అయితే ఇటలీ ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించన దేశాల జాబితాలో రెండో(27వేలు) స్థానంలో ఉంది..

 

 

మిగతా దేశాల గురించి తెలుసుకుంటే.. ఫ్రాన్స్ లో 1.65 లక్షలు కేసులు నమోదవ్వగా.. మరణాలు 23,660 వరకు చోటు చేసుకున్నాయి. యూకే లో 1.61లక్షల కరోనా కేసులు బయటపడగా.. 21,678 మరణాలు సంభవించాయి... జర్మనీ 1.59 లక్షలు కాగా మరణించిన వారు 6,314 మంది.. టర్కీ లో నమోదైన కేసులు 1.14లక్షలు.. మరణించిన వారు 2,992 మంది.. రష్యా లో ఈ వైరస్ బారిన 99 వేల ప్రజలు పడగా.. 972 మందిని బలిగొంది.. ఇక ఇరాన్   92వేలు కాగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారు 5,877 మంది.. ఇక అసలు వైరస్ పుట్టిన చైనాలో ఈ కరోనా కోరలకు చిక్కిన వారు 82,858 కాగా.. మరణించిన వారు 4633 మంది అని లెక్కలు వేసారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: