తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా  వైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ  కొత్త కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని ఓ పట్టణంలో ఒక్కసారిగా కొత్త  కేసులు పెరిగిపోయాయి. అయితే ఆ ప్రాంతంలో వైరస్  ఎలా వ్యాప్తి చెందింది  అని తెలుసుకోవడానికి అధికారులు పోలీసులు తీవ్రంగా శ్రమించారు అనే చెప్పాలి.చివరికి సీసీ కెమెరాల ఆధారంగా ఆ పట్టణంలో వైరస్ ఎలా వ్యాప్తి చెందింది అని తెలుసుకున్నారు పోలీసులు. మొదట మర్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి దగ్గు జ్వరం ఉండడంతో ఓ మెడికల్ షాపు యజమాని వద్దకు వచ్చి మందులు తీసుకున్నాడు.  అతని కారణంగా మెడికల్ షాపు యజమాని  వైరస్ బారిన పడ్డాడు. 

 

 ఇక ఆ తర్వాత మెడికల్ షాప్ పక్కన ఓ కిరణం షాపు ఉంది అందులోని మహిళతో  మెడికల్ షాపు యజమాని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. దీంతో ఆ మహిళకు  కూడా  వైరస్ సోకింది. ఇక ఆ తర్వాత ఓ  చేపలు ఆమె మహిళ కిరణా షాపు వద్దకు వచ్చి ఆ మహిళ తో మాట్లాడిన కారణంగా ఆమెకు  వైరస్ సోకింది. ఇక ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న మహిళలతో చాపలు పట్టే  మహిళ అష్టా చెమ్మా ఆడింది... దీంతో వాళ్ళు కూడా  ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. ఇక వారి ద్వారా  వారి  కుటుంబ సభ్యులందరికీ సోకింది. దీంతో  క్రమక్రమంగా  వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 

 


 అయితే మొదట మర్కజ్  సమావేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి  నుంచి మెడికల్ షాపు యజమానికి  వైరస్ సోకింది అని అధికారులు గుర్తించారు. కానీ కిరణా షాప్ మహిళకు ఎలా  వైరస్ సోకింది అనేది మాత్రం అధికారులకు ముందుగా అంతుచిక్కలేదు. ఇక ఆ మహిళను మెడికల్ షాపు యజమానిని  ఎన్నిసార్లు ప్రశ్నించిన ఎక్కడికి వెళ్ళలేదు అనే సమాధానం తప్ప మరేమీ చెప్పలేదు.కాగా  మెడికల్ షాప్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఆ ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కాస్త బయటపడింది. దీంతో మెడికల్ షాపు యజమాని నుండి సదరు మహిళకు తర్వాత మరొకరికి  ఆ తర్వాత ఇంకొకరికి ఆ తర్వాత చాలామందికి ఇలా వైరస్ వ్యాప్తి  శరవేగంగా జరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టగా ప్రస్తుతం అక్కడ వైరస్  తగ్గుముఖం పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: