ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టులని అధికంగా చేస్తోంది. అందుకే కరోనా కేసులని కూడా ఎక్కువ గుర్తించగలుగుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కరోనా టెస్టులు చేయడం లేదు. అందుకే కేసులు కూడా తక్కువ సంఖ్యలో వస్తున్నాయి.

 

అయితే ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేని ప్రతిపక్ష టీడీపీ నేతలు, సీఎం జగన్ కరోనాని కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ విమర్సలు చేస్తున్నారు. అలాగే సీఎం జగన్ కరోనా గురించి కొన్ని వాస్తవాలని ప్రజలకు తెలియజేసారు. వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నారు. ఇంకా కరోనా తెలియకుండా వ్యాపిస్తుందని, అది ఎవరికైనా రావొచ్చని, చివరకి తనకు కూడా రావొచ్చని చెప్పారు. కాకపోతే ప్రజలు దీని గురించి కంగారు పడాల్సిన పనిలేదని, ఇమ్యూనిటీ పెంచుకుంటే కరోనా తగ్గిపోతుందని అన్నారు.

 

ఇక దీనిపై కూడా టీడీపీ నేతలు పెద్ద రచ్చ చేశారు. కరోనా కట్టడి చేయడంలో జగన్ చేతులెత్తేశారని కామెంట్లు చేశారు.టీడీపీ చేసే కామెంట్లకు కౌంటర్ ఇస్తూ విజయసాయి రెడ్డి ఓ మంచి పాయింట్ చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేదాక కరోనాతో సహజీనం తప్పదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది 100 శాతం సరైందని, వైరస్ నిర్మూలనకు నేరుగా పనిచేసే మందులేవీ ఉండవని, వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాబట్టి టీడీపీ నేతలు ఇప్పటికైనా పనికిమాలిన విమర్సలు మానుకోవాలని హితవు పలికారు.

 

దోమలపై దండయాత్ర అని ప్రోగ్రాం పెట్టి దోమలని నియంత్రించగలిగారా, ఈ వైరస్ కూడా అంతే అని చంద్రబాబుకు చురకలంటించారు. నిజానికి ఇలాంటి వాస్తవాలు చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం జగన్ కు ఉంది కాబట్టే  కరోనాకు సంబంధించిన రియాలిటీని ప్రజలకు వివరించారు. కాబట్టి ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేయకుండా ఉంటే బెటర్ ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: