దేశంలో ఏ సీఎం చేయని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే ఏపీ సీఎం జగన్, అనేక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన విషయం తెలిసిందే. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో దాదాపు 80 శాతం హామీలు అమలు చేశారు. ఆర్ధిక పరిస్థితి బాగోకపోయిన సరే ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా లాంటి మహమ్మారి వల్ల, లాక్ డౌన్ కొనసాగుతూ, ఆదాయం వచ్చే మార్గాలు మూసుకుపోయిన కూడా ప్రజలని ఆదుకోవడం ఆపలేదు.

 

ఇలాంటి సమయంలో కూడా ఏ సీఎం చేయని విధంగా ఓ వైపు కరోనాని కట్టడి చేస్తూనే, మరోవైపు  ప్రజలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఉచిత రేషన్ ఇచ్చారు. ఇంకా రూ. వెయ్యి అందించారు. అలాగే క్వారంటైన్ పూర్తి చేసుకున్నవారికి రూ.2 వేలు సాయం ఇస్తున్నారు. ఇక తాజాగా 80 లక్షలకు పైనే మహిళలకు ఉపయోగపడేలా 1400 కోట్లతో సున్నా వడ్డీ పథకాన్ని అందించారు. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన పేరుతో 4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన 1880 కోట్ల బకాయిలని కూడా చెల్లించారు.

 

ఇంత విపత్కర సమయంలో కూడా జగన్...తాను అనుకున్న సమయానికి పథలకాలని ప్రజలకు అందిస్తున్నారు. ఇంకా మొదట్లో ప్రారంభించిన పథకాలు అందని అర్హులకు కూడా మళ్ళీ లబ్ది చేకూరేలా చేస్తున్నారు. అయితే ఇంత చేస్తున్న జగన్, మరొకసారి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులని ఏపీకి రప్పించే ఏర్పాట్లు చేశారు. 4 వేలకు పైనే మత్స్యకారులు తమ సొంత ప్రాంతాలకు చేరుకోనున్నారు. ఇక వారు ఇళ్లకు చేరుకున్నాక, రూ. 2 వేలు సాయం చేయాలని అధికారులని ఆదేశించారు.

 

అయితే ఈ విధంగా ప్రజలని ఆదుకుంటున్న జగన్ పై ఓ టీడీపీ అనుకూల మీడియా విషం చల్లే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అమ్మఒడి పథకం విషయంలో జగన్ తప్పులో  కాలేశారంటూ మాట్లాడుతుంది. ఒక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కరికే అమ్మఒడి పథకం వర్తింపని చెప్పారని, మరి 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం కింద నగదు ఇస్తే.. 82 లక్షల మంది పిల్లలకు ఎలా ప్రయోజనం చేకూరుతుందో సీఎం చెప్పాలని ప్రశ్నిస్తోంది.

 

అయితే ఆ మీడియా ఓ లాజిక్ మిస్ అయిందని విశ్లేషుకులు అంటున్నారు. ఒక తల్లికే ఇద్దరు, ముగ్గరు పిల్లలు ఉండొచ్చని, అమ్మఒడి పథకం కింద వచ్చిన రూ.15 వేలని ఆ తల్లి, పిల్లలకు ఉపయోగించుకుంటుందని చెబుతున్నారు. తల్లికి 15 వేలు వచ్చినప్పుడు, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటే, ఒకరికే ఆ డబ్బు వినియోగించదు కదా అని అంటున్నారు. అందుకే జగన్ 43 లక్షల తల్లులు, 82 లక్షల మంది పిల్లలు అని చెప్పారని వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: