కరోనాపై ఏపీ ప్రభుత్వం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఓ వైపు కరోనా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్ధిక పరిస్థితి కుంటుపడిన కూడా, ప్రజలకు ఎలాంటి లోటు చేయకుండా పథకాలు అందిస్తున్నారు.

 

అయితే కరోనాపై పోరాటం చేసేందుకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, మానవతా వాదులు ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విరాళాలు సేకరిస్తున్నారు.

 

ఇక దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి విశాఖలో విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నారని, ట్రస్ట్ ముసుగులో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, కరోనా సంక్షోభం.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని మాట్లాడారు. ఈ విధంగా బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.

 

విరాళాలన్నీ స్వచ్చందంగానే వస్తున్నాయని, ఎవరు  బలవంతపు వసూలుకు పాల్పడటం లేదని, కావాలంటే విరాళాలు ఇచ్చిన వారిని అడగొచ్చని అంటున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే సహకరించాలే తప్ప, బురద జల్లే పని మాత్రం చేయకూడదని, అసలు బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు బాబుకు ఎవరైనా వచ్చి చెవిలో చెప్పారంటూ మండిపడుతున్నారు.

 

పైగా కరోనాని ఏటీఎంగా వాడుకుంటున్నారని మాట్లాడుతున్నారని, ఇలాంటి సమయంలో కూడా అలాంటి పనులు చేసేది మీ పార్టీ వాళ్లే అంటూ తీవ్ర స్థాయిలో విమర్సలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో మీకు ఎన్ని ఏటీఎంలుగా మారాయో ప్రజలకు తెలుసని, ప్రతిదానిలోనూ దోపిడీ చేసారు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని ఓడించి ఇంటిలో కూర్చోబెట్టారని, ఇకనైనా అర్థంపర్ధం లేని విమర్సలు చేయడం ఆపేసి, ప్రభుత్వానికి సహకరిస్తే మంచిదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: