కాంగ్రెస్ పార్టీ టైములో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా జి.వి.హర్షకుమార్ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగారు. ఆ సమయంలో రాష్ట్ర విభజనను హర్షకుమార్ వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నుండి అనేక కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. విభజన జరిగిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి రావడంతో టిడిపి తో కూడా పోరాడారు. టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రంలో దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు అంటూ పెద్ద ఉద్యమమే చేయటానికి రెడీ అయ్యారు. ఆ సమయంలో అనేక కేసులు గృహ నిర్భందాలు ఇంకా చాలా రకాలుగా హర్ష కుమార్ కష్టాలు పడటం జరిగింది. అయినా కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోరాడటం జరిగింది.

 

ఇక ఎన్నికల టైం వచ్చే సమయానికి హర్ష కుమార్...జగన్ కి కొద్దిగా ఫేవర్ గా ఉన్నాడు. దీంతో చాలామంది జగన్.. హర్ష కుమార్ కి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ అప్పటికే జగన్ మరొకరికి మాట ఇచ్చేయడంతో ఆ విషయం తెలుసుకొని హర్ష కుమార్ డ్రాప్ అయ్యారు. అదే సమయంలో టీడీపీ నుండి కొద్దిగా సానుకూల వాతావరణం ఉండటంతో ఏమి ఆలోచించకుండా హర్ష కుమార్ సైకిల్ ఎక్కడం జరిగింది. దీంతో అప్పటికే టిడిపి పై తీవ్ర ఆగ్రహం తో ఉన్న దళితులు హర్షకుమార్ చేసిన పనికి నోచ్చుకున్నారు.

 

అదే సమయంలో ఎన్ని కష్టాలు పడిన తనకే టికెట్ చంద్రబాబు ఇస్తారు  అనుకున్న సమయంలో ఆ టికెట్ ని దివంగత స్పీకర్ బాలయోగి కుమారుడికి ఇవ్వటంతో హర్ష కుమార్ కి కోపం వచ్చి వెంటనే సైకిల్ దిగిపోయారు. బాబు కి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ దళితులకు ఫత్వా జారీ చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా బోర్డు పడవ ప్రమాదం గొడవలు ఇంకా అదేవిధంగా పాత కేసులు ఇలా అనేక రకాల కేసుల్లో హర్షకుమార్ చిక్కుకుపోయాడు. దీంతో వీటన్నిటినీ ఛేదించుకుని బయటకు రావాలంటే కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: