వైయస్ జగన్ తన ప్రత్యర్థులను సైలెంట్ గా కూర్చోబెట్టడం లో, ట్రీట్మెంట్ ఇవ్వటంలో ఆయనకు మించినవారు ఏపీ రాజకీయాల్లో ఉండరని చాలామంది అంటుంటారు. శత్రువుల విషయంలో పక్క కాన్ఫిడెన్స్ స్కెచ్ వేసి ముప్పుతిప్పలు పెట్టాలన్న లైఫ్ లేకుండా చేయాలన్నా (కెరియర్ పరంగా) జగన్ ఐడియాలు చాలా సూపర్ గా ఉంటాయని చాలామంది అంటారు. అప్పట్లో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో తనని ఆపినా ప్రతి ఒక్క ఆఫీసర్ కి జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. రెండే రెండు సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటా ఎవరిని మరచిపోను అని సవాలు చేసి అధికారంలోకి వచ్చాక… తనని తన పార్టీని అనేక విధాలుగా ముప్పుతిప్పలు పెట్టిన అధికారులకు తనదైన శైలిలో ఇప్పటికే జగన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో పార్టీలో ఎంపీగా ఉంటూ  పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడిన నరసాపురం ఎంపీ జగన్ పక్కలో బల్లెం ల తయారయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గొడవ పెట్టే విధంగా కూడా అప్పట్లో వ్యవహరించినట్లు అనేక పరిణామాలు బట్టి అందరికీ తెలిసినదే.

 

 

ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో ఎంపీ నిధుల నుండి చాలామంది విరాళాలు ప్రకటిస్తున్న… రఘురామకృష్ణంరాజు జాడ ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. దీంతో నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే పార్టీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కి జగన్ నుండి గట్టి వార్నింగ్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో ఆయన సైలెంట్ అయిపోయినట్లు పార్టీ లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: