దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజు కు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ , గుజరాత్ లలో రోజు భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సౌత్ విషయానికి వస్తే తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ కేసుల పెరుగుదల విషయంలో నువ్వా నేనా అన్నట్లు  పోటీ పడుతున్నాయి. అయితే ఈరెండు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 4000 కు పైగా టెస్టులు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా కొత్తగా 104 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దాంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2162 కు చేరుగా  27 మరణాలు సంభవించాయి. 1210 మంది కోలుకున్నారు. అయితే  ఆరాష్ట్రంలో కేవలం ఒకే  ఒక్క జిల్లా కృష్ణ గిరి గ్రీన్ జోన్ లో వుంది. గత 28రోజుల నుండి ఈజిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా మిగిలిన జిల్లాల్లో 11 ఆరెంజ్ జోన్ లో ఉండగా  మిగితావన్ని రెడ్ జోన్ లో వున్నాయి. రోజు రోజు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కొనసాగుతుంది. 
 
ఇక ఆంధ్రాలో ఈరోజు కొత్తగా మరో 73 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరింది. అయితే  కేసుల సంఖ్య పెరుగుతున్న కూడా లాక్ డౌన్ సడలింపుల విషయంలో  ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఏపీ సర్కార్. ఈరోజు కొత్తగా మరి కొన్ని మినహాయింపులు  ప్రకటించింది. ఇక తెలంగాణ లో  ఈరోజు కేవలం 7 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇందులో ప్రస్తుతం 585కేసులు యాక్టీవ్ లో వున్నాయి. గత వారం రోజుల నుండి  రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: