ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై శాస్త్రవేత్తల పోరాటం మరింత జోరందుకుంటోంది. ఈ మహమ్మారికి వాక్సీన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనాపై ఒక దేశం అనే కాదు.. అనేక దేశాల శాస్త్రవేత్తలకు కరోనా ఓ సవాల్ గా మారింది. అయితే ఇప్పటికిప్పుడు వాక్సీన్ మాత్రం లభించే అవకాశం లేదు. ఈ వాక్సీన్ వచ్చేందుకు మరో ఏడెనెమిది నెలలు వెయిట్ చేయాల్సిందే.

 

 

అయితే ఇప్పటికిప్పుడు వాక్సీన్ కనిపెట్టకపోయినా ఆ దిశగా అడుగులు పెడుతున్నాయి. కరోనా వైరస్ కు సంబంధించిన పరిశోధనలను మరింత సులభతరం చేసే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. కొవిడ్ -19కు చెందిన 29 భిన్నమైన డీఎన్‌ఏ పరిణామ క్రమాల్లో అంతర్లీనంగా ఉండే జన్యు సిగ్నేచర్ ను నిమిషాల్లోనే గుర్తించేందుకు అవకాశం ఏర్పడింది. కెనడాలోని వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ కెనడా శాస్త్రవేత్తలు ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి ఈ విజయం సాధించారు.

 

 

దీనివల్ల ఏం ఉపయోగం అంటే.. గతంలో ప్రపంచాన్ని వణికించిన వైరస్ ల తరహాలోనే కరోనా వైరస్ తో పాటు ఇతర వైరస్ లను వర్గీకరించేందుకు ఇది ఉపయోగపడుతోంది. నావెల్ కరోనా వైరస్ జీనోమ్ సిగ్నేచర్లను మెషిన్ లెర్నింగ్ విధానం 100 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుందని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా కేవలం నిమిషాల్లోనే 5000 కు పైగా వైరల్ జీనోమ్ లతో కరోనాతో సంబంధాల్ని గుర్తించారు.

 

 

ఒక వైరస్ జీనోమ్ సిగ్నేచర్లను అధ్యయనం చేస్తే.. ఈ కరోనా గుట్టుమట్టు అంతా రట్టవుతుంది. ఏం చేస్తే ఈ కరోనాను కట్టడి చేయవచ్చో.. ఏం చేస్తే ఈ కరోనాను అంతం చేయవచ్చే కనిపెట్టేందుకు అవకాశం లభిస్తుందన్నమాట. ఏదేమైనా కరోనా కాటుతో ప్రపంచం అల్లాడుతున్న వేళ ఇలాంటి శుభవార్తలు చాలా ఊరటనిస్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: