ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్నట్టు సాగుతాయి కొన్ని జీవితాలు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పరిస్థితి అలాగే ఉంది మరి. ఆయన కరోనా బారిన పడి నిన్న మొన్నటి వరకూ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడారు. కరోనా కారణంగా ఆయన్ను కొన్ని రోజులుపాటు ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందించాల్సి వచ్చింది. ఇటీవలే ఆయన కరోనా దెబ్బ నుంచి కోలుకుని హమ్మయ్యా అనుకున్నారు.

 

 

అలాంటి బోరిస్ జాన్సన్ జీవితంలో ఇప్పుడు మరో శుభవార్త వచ్చేసింది. ఆయన రెండోసారి తండ్రి అయ్యారు. ఆయన కాబోయే భార్య క్యారీ సైమండ్స్ లండన్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తిగా నెలలు నిండకుండానే శిశువు పుట్టాడు. అయినా సరే.. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారు. అదేంటి కాబోయే భార్య అంటున్నారు. కొడుకు అంటున్నారు అనుకుంటున్నారా..?

 

 

అవును మరి బోరిన్ జాన్సన్, క్యారీ సైమండ్స్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం వారు సహజీవనంలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన తొలి జంటగా బోరీస్ జాన్సన్, సైమండ్స్ కొత్త రికార్డు సృష్టించారు. మరో విచిత్రం ఏంటంటే.. బోరిస్ కు క్యారీ పెళ్లయితే మూడో భార్య అవుతుంది. అవును.. బోరిస్ 1987లో అలెగ్రా మోస్టిన్ ఓవెన్ అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు.

 

 

కొన్నాళ్లకే వారు విడిపోయారు. ఆ తర్వాత 1993లో మరీనా వీలర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పెళ్లయితే క్యారీ మూడో భార్య అవుతుంది. ఇప్పటికే ఈ జంటకు ఓ సంతానం కూడా ఉంది. ఇది రెండో సంతానం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: