అవును ఇది ఇండియాకు నిజంగా షాకింగ్ న్యూసే.. ఇండియా కంటే.. బీజేపీ నాయకులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్రమోడీ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ వార్త అనే చెప్పాలి. ఇంతకూ విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ప్రధాని మోడీని వదిలేశాడు. వదిలేయడం అంటే.. ఆయన్ను ఫాలో కావడం మానేశారు. అవును.. కొన్ని నెలల క్రితం నరేంద్ర మోడీ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయిన మోడీ ఇప్పుడు అన్ ఫాలో చేసేశాడు.

 

 

అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడి కోసం వైట్ హౌజ్ ఓ ట్విట్టర్ అకౌంట్ ను మెయింటైన్ చేస్తుంది. దీని ద్వారా అమెరికా అధ్యక్షుడి హోదాలో ప్రకటనలు ఉంటాయి. ఇది అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్. అయితే కొన్ని నెలల క్రితం ఈ వైట్ హౌజ్ ట్విట్టర్ అనూహ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో చేయడం ప్రారంభించింది. అంతే కాదు.. భారత ప్రధాని హోదాలోని ట్విట్టర్ అకౌంట్ ను, ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్ అకౌంట్‌ను, ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో చేయడం ప్రారంభించింది.

 

 

అప్పట్లో నరేంద్ర మోడీ అభిమానులు దీన్ని మోడీ సాధించిన విజయంగా చెప్పుకున్నారు. అసలు అమెరికా అధ్యక్షుడి ట్విటర్ అకౌంట్ ఒక ప్రధానిని ఫాలో చేయడం ఇదే ప్రధమం అని చెప్పుకున్నారు. అంతే కాదు. మొన్న కరోనా సమయంలో ఇండియా క్లోరోక్విల్ మాత్రలు పంపినప్పుడు ట్రంప్ మోడీని ఆకాశానికి ఎత్తేశాడు కూడా.

 

 

మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ.. అనూహ్యంగా వైట్ హౌజ్ ట్విట్టర్ అకౌంట్ మోడీని, ప్రధానిహోదాలోని ట్విట్టర్ అకౌంట్ ను, ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్ అకౌంట్‌ను, ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ అకౌంట్ ను అన్నింటినీ అన్ ఫాలో చేసింది. మరి ఇందుకు కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: