కొన్ని ఘటనలు మనకు అయ్యో అనిపిస్తాయి.. మరికొన్ని ఘటనలు వారికీ మాత్రమే అయ్యో అనిపిస్తాయి.. కానీ ఈ ఘటన మాత్రం ప్రజలందరి చేత కన్నీళ్లు పెట్టించింది.. అయ్యో అనిపించింది. ఎంత దారుణమైన  ఘటన ఇది అని అనిపించేలా చేసింది. అదే పాము కుక్క పోరాటం.. ఇంకా మీకు గుర్తుకు రావడంలేదా? 

 

అదేనండి.. యజమాని పెట్టిన అన్నంకు రుణపడిన కుక్క.. విశ్వాసంతో యజమాని ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టి మరి పాముతో పోరాడి.. పాముని చంపి తన విశ్వాసాన్నిప్రేమను చాటుకుంది. నిజంగా ఈ కుక్కను చూశాక అనిపించింది.. విశ్వాసం అంటే ఇదేరా అని.. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే? 

 

ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం పరిధిలోని గోపాలకుంటలో ఈ ఘటన జరిగింది.. వివరాలలోకి వెళ్తే గోపాలపురంలో కిశోర్ అనే వ్యక్తి స్థానికంగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. అతడికి స్నూపీ అనే ఓ పెంపుడు కుక్క ఉంది. ఏప్రిల్ 11 రోజు కిషోర్ తమ ఇంటి వెనుకాల మంచంమీద నిద్రిస్తున్నాడు. 

 

ఆ సమయంలోనే యజమానికి సమీపంలోకి ఓ పాము వచ్చింది. తరువాత మరింత బుసలు కొడుతూ యజమానికి దగ్గరగా వెళ్ళింది అయితే ఇది అంత గమనించిన స్నూపీ అరవడం మొదలు పెట్టింది. నిద్ర నుండి మేల్కొన్న కిషోర్ చూసుకోగా అప్పటికే మంచం పైవరకు ఎక్కేసింది. దీంతో ఆ స్నూపీ ఒక్కసారిగా ఆ పాముని నోటితో కరాచీ పట్టుకొని పక్కకు లాగి కరవడం మొదలు పెట్టింది. 

 

అయితే పామును పక్కకు లాగి కర్రతో కొట్టి చంపేశాడు.. కానీ స్నూపీ మాత్రం పాము కాటుకు గురైయింది. ఇది గమనించిన యజమాని స్నూపీని వెంటనే వెటర్నటీ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.. అయితే వెళ్లేలోపే అది ప్రాణాలను విడిచింది. ఇంకా ఆ స్నూపీ మరణంతో ఆ కుటుంబం అంత కన్నీరుమున్నీరైంది.. ఇంకా ఈ ఘటన తెలుసుకున్నా ప్రజలంతా అయ్యో అని కన్నీరు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: