ఏపీలో సీఎం జగన్ కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి తరచూ ప్రెస్ మీట్ పెడుతూ అలా చేయండి.. ఇలా చేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. జగన్ ఏదైనా చేస్తే.. అబ్బే అది మేం ముందే చెప్పామంటూ చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు లేని పోని అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు.

 

 

ఉదాహరణకు.. త్వరలో వైఎస్ఆర్ రైతుభరోసా పథకాన్ని వైసీపీ సర్కారు అమలు చేయబోతోంది. కానీ చంద్రబాబు ముందే... 4 లక్షల లబ్దిదారుల్ని తొలిగించారని ఆరోపించారు. దీనిపై కన్నబాబు స్పందిస్తూ.... “ మే 15 నుంచి వైఎస్ఆర్ రైతుభరోసా పథకాన్ని అమలు చేయబోతున్నాం. ఈరోజు చంద్రబాబు మీడియాకు ఓ లేఖ రిలీజ్ చేశారు. 4 లక్షల లబ్దిదారుల్ని తొలిగించామని బాబు ఆరోపిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు చంద్రబాబు అన్నట్టుంది.. అంటూ సెటైర్లు వేశారు.

 

 

ఇంకా కన్నబాబు ఏమన్నారంటే..” లాస్ట్ టైమ్ 46లక్షల 50వేల మంది లబ్దిదారుల్ని గుర్తించి సహాయం చేశాం. ఇప్పుడు అదనంగా మరికొంతమంది లబ్దిదారుల్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం. అంతలోనే 4 లక్షల మంది తొలిగించామని చంద్రబాబు ఎలా చెబుతారు.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కంటే ఎల్లో వైరస్ ను అడ్డుకోవడం కష్టంగా ఉంది అంటూ మండిపడ్డారు మంత్రి కన్నబాబు.

 

కరోనా వైరస్ లక్షణాలు స్పష్టంగా తెలుస్తున్నాయి కానీ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తున్న ఎల్లో వైరస్ లక్షణాలు మాత్రం కనిబెట్టడం కష్టంగా ఉందంటూ కన్నబాబు వెటకారం ఆడారు. వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే, తెలుగుదేశం కార్యకర్తలే కొనుగోలు చేసి పంచుతున్నారంటూ చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అసలు ఏ తెలుగుదేశం నాయకుడు బయటకొచ్చి పంచుతున్నారో చెప్పాలని కన్నబాబు నిలదీశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: