దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టిపీడిస్తున్న వేళ... కరోనా వైరస్ పోరాటంలో దేశ ప్రజానీకం మొత్తం ఒక్క తాటిపై ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అటు  అధికారులు కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కరోనా  వైరస్ రోగులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. అయినప్పటికీ కొంతమంది కారణంగా కరోనా  వైరస్ వ్యాప్తి మాత్రం జరుగుతూనే ఉంది. ఇక మరి కొంతమంది కారణంగా ఎంతోమంది  హోమ్ క్వారంటైన్ వెళ్లాల్సి  వస్తుంది. అయితే ఇది కావాలని చేస్తున్నది కాదు. ఒక వ్యక్తిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి తనకి తాను ఆరోగ్యంగానే ఉన్నాను అనుకుంటాడు కాబట్టి యథేచ్ఛగా  ప్రతి చోటుకి తిరుగుతూ ఉంటాడు. 

 

 

 దీంతో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువ అయిపోతు ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ పోరాటంలో భాగంగా హెల్త్ వర్కర్లు డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న త్యాగం మరువలేనిది అనే చెప్పాలి. ప్రాణాలను పణంగా పెట్టి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆంబులెన్స్ డ్రైవర్ కి కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ కావడం రెండు  కుటుంబాల్లో కరోనా కలకలం రేపింది. అంబులెన్స్ డ్రైవర్ కి కరోనా నిర్థారణ  కావడంతో ఏకంగా రెండు కుటుంబాలకు చెందిన 17 మంది హోమ్ క్వారంటైన్  లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

 

 

 ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ నెల 20న కింగ్ కోటి నుంచి 108 ఆంబులెన్స్ లో ఓ తల్లి బిడ్డను అంబులెన్స్ డ్రైవర్ గ్రామానికి క్షేమంగా తీసుకువచ్చాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే అంబులెన్స్ డ్రైవర్ కరోనా  వైరస్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో  భాగంగా డ్రైవర్ తీసుకు వచ్చిన మహిళ కుటుంబ సభ్యులైన  13 మంది మందితో పాటు మరో ఆటోడ్రైవర్ కుటుంబ సభ్యులు నలుగురిని... 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో  ఉండాలని స్టాంప్ వేసి ఆదేశాలు జారీ చేశారు అధికారులు. 

 

 

 అయితే ఇప్పుడు వరకు అధికారులు హోమ్ క్వారంటైన్  లో ఉంచిన  వారిలో ఎవరికీ కరోనా  వైరస్ లక్షణాలు లేవు అంటూ స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎలాంటి వైరస్ లక్షణాలు లేని వారికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: