మామూలుగా నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు చలనాలు విధిస్తూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా అందరికీ చలనాలు విధించడం మామూలే. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వం లోని పలు డిపార్ట్మెంట్ లకు చెందిన వారికి పోలీసులు నిబంధనలు అతిక్రమించినప్పటికీ చూసీ చూడకుండా డిపార్ట్మెంట్ వాళ్లే కదా అని ఊరుకుంటారు. కొంతమంది మాత్రం నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా చలనాలు విదిస్తూనే ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తికి పోలీసులు చలానా విధించారు. అయితే చలానా కట్టిన సదరు వ్యక్తి విద్యుత్ డిపార్ట్మెంట్కు చెందిన కార్మికుడు. దీంతో నాకే చలానా విధిస్తారా అని ఏకంగా పోలీసులకే షాక్ ఇచ్చాడు సదరు వ్యక్తి. 

 

 

 ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు అంటారా.. ఏకంగా పోలీస్ స్టేషన్ కి కరెంట్ కట్ చేసి పోలీసులకే షాక్ ఇచ్చాడు కరెంట్ కార్మికుడు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్  కోటి బార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టు కార్మికుడికి చతేహా చౌకి పోలీసులు చలానా విధించారు . ఇక నాకే చలన విధిస్తారా అని ఆగ్రహించిన ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టు కార్మికులు పోలీస్ స్టేషన్ కు కరెంట్ కట్ చేసాడు.  దీంతో పోలీసులు పోలీస్ స్టేషన్ వదిలి విద్యుత్ కార్యాలయం ముందు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్ కు విద్యుత్ మళ్లీ పునరుద్ధరించిన తర్వాత  ఆందోళన విరమించారు పోలీసు అధికారులు. 

 

 

 విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు  హెల్మెట్ లేకుండా బైక్ నడపడం తో నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నడుపుతున్నాడనే  ఆరోపణతో పోలీసులు అతనికి  చలానా  విధించారు. దీంతో  కోపోద్రిక్తుడై అయ్యాడు ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కార్మికుడు . దీంతో వెంటనే చెక్పోస్ట్ వద్దకు చేరుకొని విద్యుత్ స్తంభం నుంచి పంచాయతీ భవనం లో నడుస్తున్న పోలీస్ పోస్ట్ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేసేసాడు. ఇక దీన్ని గమనించిన పోలీస్ అధికారులు వెంటనే విద్యుత్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఇక విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చొరవతో పోలీస్ స్టేషన్ కు విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. ఇక ఈ ఘటనపై విద్యుత్ ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: