ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా బాధితులకు సహాయంగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు, వారికి కావలసిన పదార్థాలు అన్నీ కూడా అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే లాక్ డౌన్ విధానాన్ని కూడా కఠిన చర్యలతో అమలు చేస్తూ ఉన్నారు. ఈ లాక్ డౌన్ అమలుతో రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటన్న విషయానికి వస్తే వెహికల్ టాక్స్ చెల్లింపు చేయవలసిన గడువుని పెంచడం. 

 


వెహికల్ టాక్స్ గడువుని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. నిజానికి ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీన ముగుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో దీన్ని మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.  వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అనగా లాక్ డౌన్ విధానం అమలులో ఉండటంతో ప్రజలకు ఎటువంటి ఆదాయం లేకుండా ఉంది అన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

 

కాగా నిజానికి వెహికల్ టాక్స్ లో ముందుగానే చెల్లిస్తారు చాలావరకు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వెహికల్ టాక్స్ చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ సరిగ్గా టాక్స్ చెల్లించలేక పోయిన వారికి 50 నుంచి 200 శాతం వరకు జరిమానా కూడా విదిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలలో కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. అంతే కాకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానం అమలుతో ఎక్కడికక్కడ సరుకు రవాణా లారీలు కూడా నిలిచిపోవడం జరిగింది. అంతేకాకుండా టాక్స్ చెల్లింపు విషయంలో కాస్త వెసలుబాటును లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ ఒకందుకు ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: