గత కొన్ని వారాలుగా భారత ప్రధాన మోడీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా అన్ ఫాలో అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం భారత్ లో చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి. అంతేకాకుండా భారత్ అమెరికా మధ్య అనుబంధాలను దెబ్బ తీసుకున్నట్లే ఉంది అంటూ పలువురు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి వైట్ హౌస్ వర్గాలు వివరణ ఇవ్వడం జరిగింది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన అధికారుల ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్ ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక అధ్యక్షుడు పర్యటనకు మద్దతుగా వారి ట్విట్స్‌ను రీట్విట్ చేసేందుకు కొద్దికాలం ఆ ఖాతాలను ఫాలో అవుతున్నట్లు వారి తెలియజేశారు. 


ఇక వైట్ హౌస్ ట్విటర్ ‌లో అమెరికా ప్రభుత్వ సీనియర్ అకౌంట్స్ అనుసరించడం జరుగుతుంది. అంతేకాకుండా అధ్యక్షుడు విదేశీ పర్యటన సమయంలో మాత్రమే అందుకు.. డోనాల్డ్ ట్రంప్ పర్యటన చేసే దేశాలకు సంబంధించిన అకౌంట్ ను కొద్దికాలం పాటు ఫాలో అవుతుంది అని వైట్ హౌస్ లోని ఒక సీనియర్ అధికారి తెలియజేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో ఇండియా పర్యాటక వచ్చిన సమయంలో వైట్ హౌస్ అధికార ట్విటర్ అకౌంట్... రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రధాని కార్యాలయం, భారత్ లో అమెరికా రాయబారి ఇలా పలు ట్విట్టర్ ఖాతాలను అనుసరించడం జరిగింది.  ఇది ఇలా ఉండగా తాజాగా ఆ కథల అన్నిటిని కూడా వైట్ హౌస్ ట్విట్టర్లో ఫాలో చేయడం జరిగింది. ఇలా చేయడంతో వైట్ హౌస్ ట్విటర్‌ లో అనుసరిస్తున్న ఖాతాల సంఖ్య 13కు వచ్చింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: