జాతీయ అర్హత పరీక్ష-నీట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వైద్య విద్యాసంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో నీట్ మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని  స్పష్టం చేసింది. మైనార్టీ విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం.

 

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులన్ని జాతీయ పరిక్షలో వచ్చిన మార్కుల ద్వారానే పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. మైనారిటీ సంస్థలు, డ్రీమ్‌డ్ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలలన్ని నీట్ ద్వారానే భర్తీ చేయాలని, దీని ద్వారా ఆయా విద్యాసంస్థలకు ఎటువంటి హక్కులు భంగం వాటిళ్లదని తెలిపింది ధర్మాసనం. వ్యవస్థల్లో చెడును నిర్ములించి, పారదర్శకతను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోడ్‌ చేసింది ధర్మాసనం.

 

ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర కౌన్సిలింగ్ ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేందుకు ప్రైవేటు కళాశాలలు నిరాకరించడాన్ని కోర్టు తప్పుపట్టింది. నీట్ మార్కుల ఆధారంగానే అన్ని విద్యా సంస్థలు విద్యార్థులను చేర్చుకోవాలని సూచించింది. అంతేగాక, నీట్‌ను కాదని మరో పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని, ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక అనుమతులు మంజూరు చేయలేం అని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.


  
నీట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తే తమ హక్కులకు భంగం కలుగుతుందని గతంలో కొన్ని మైనారిటీ, ప్రైవేటు కళాశాలలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతే కాకుండా తమ సంస్థలలో అడ్మిషన్‌ కోసం ప్రత్యేకంగా పరీక్షను నిర్వహించేందుకు అనుమతించాలని కోరాయి. ఈ రెండు ఆలోచనలు తప్పని కోర్టు అభిప్రాయపడింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: