చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకింది. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా అమెరికా అతలాకుతలమవుతోంది. అయితే.. అమెరికాలో వైరస్‌ మహమ్మారి విజృంభిస్తుండడంతో చైనా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు. ట్రంప్ బెదిరింపులకు అనుకుంటున్నారా...? కానే కాదు.. మరెందుకో తెలుసా...? ఆయన ఒక్కగానొక్క కూతురు ఇప్పుడు అమెరికాలో ఉండడమే ఆయన భయాందోళనకు కారణం.

 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఒక్కగానొక్క కూతురు ఉంది. పేరు జి మింగ్జే..! 2014 సమయంలో అమెరికాలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జి మింగ్జే.. తర్వాత చైనాకు తిరిగి వచ్చేసింది. అయితే ఉన్నత చదువులకోసం మళ్లీ అమెరికాకు వెళ్లాలనుకుందామె.! దీంతో కూతురు మాట కాదనలేక మళ్లీ అమెరికాకు పంపించారు జిన్‌ పింగ్.! అయితే అమెరికాలో ఆమె చైనా అధ్యక్షుడి కూతురుగా చదవలేదు. చైనాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కూతురుగా పరిచయం చేసుకున్నారు. భద్రతా కారణాలరీత్యా ఉన్నత స్థానాల్లో ఉన్న పిల్లలు ఇలా మారుపేర్లతో చదువుకోవడం అలవాటే.! 

 

అయితే కరోనా వైరస్ ప్రారంభమైన సమయంలో జి మింగ్జే చైనాలో ఉంది. వుహాన్‌లో ఎప్పుడైతే వైరస్ వ్యాప్తి ఉధృతమైందో వెంటనే ఆమె అమెరికాకు వెళ్లిపోయింది. వైరస్ వ్యాప్తికి భయపడి జిన్‌ పింగే కూతురిని అమెరికా పంపించేశారనే అభియోగాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. చైనా కంటే అమెరికా సేఫ్‌ అని భావించి ఆమెను అక్కడికి పంపించి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా కంటే అమెరికాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దీంతో అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్ర కంగారు పడుతున్నారట..

 

కూతురి సేఫ్టీపై కంగారు పడుతున్న జిన్‌పింగ్‌.. ఆమె భద్రతకోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసలే చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారాలు మిరియాలూ నూరుతున్నారు. ఈ నేపథ్యంలో కూతురు కూడా అక్కడే ఉండడం.. మరోవైపు వైరస్‌ అక్కడ తీవ్ర ప్రభావం చూపిస్తుండడం జిన్‌పింగ్‌కు నిద్రపట్టనీయడం లేదు. మరి ఏం చేస్తోరో.. చూడాలి!

 

మరింత సమాచారం తెలుసుకోండి: