దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరు చెబితే భయపడిపోతున్నారు.  ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నందుకే ఈ భయం. ఒక మనిషి తుమ్మినా.. దగ్గినా విచిత్రంగా చూడటమే కాదు ఆ మనిషికి నుంచి దూరంగా పారిపోతున్నారు.  అయితే ఈ కరోనా మహమ్మారి ని అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పోలీసులు తమ ప్రాణాలతో పోరాడుతూ రక్షణ చేపబడుతున్నారు.    ఒకవేళ లాక్ డౌన్ ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  అయితే కరోనా భూతం పోలీసులను సైతం వదలడం లేదు.  ఇప్పటికే ముంబాయిలో ముగ్గురు పోలీసులు కరోనా రక్కసికి బలయ్యారు.  అయితే కొన్ని చోట్ల కరోనా వైరస్ ఉన్నవారిని పట్టుకోవడం వల్ల కూడా పోలీసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

 

ఆ మద్య ఓ దొంగ విషయంలో ఐపీఎస్ ట్రైనీకి కూడా కరోనా సోకింది.  ఇటీవల ఓ దొంగ వల్ల పోలీసులు, అతనికి శిక్ష విధించిన జడ్జీ కూడా క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.  తాజాగా కరోనా పేరు చెప్పి ఓ దొంగ పోలీసులను బురిడీ కొట్టించాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఈ తతంగం చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. మాయాండీ అనే దోపిడీ దొంగను మంగళవారం అరెస్ట్ చేసిన పోలీసులు తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని సెంట్రల్ జైలుకు తీసుకెళ్తున్నారు. అయితే నిందితన్ని వ్యాన్ లో ఎక్కించుకొని పోలీసులు ప్రయాణం చేస్తుండగా.. సదరు దొంగ గట్టిగా తుమ్మాడు.. అంతటితో ఆగకుండా దగ్గడం మొదలు పెట్టాడు. 

 

దాంతో పోలీసులు అతనికి కాస్త దూరం జరిగిగారు.. దాంతో ఈ దొంగకు ఓ ఐడియా వచ్చింది. తనకు కరోనా ఉందన్న అనుమానం ఉందని.. చెప్పాడు. ఇంకేముందు వ్యాన్ ని కాస్త హాస్పిటల్ కి మల్లించారు.  వైద్యులు అతణ్ని పరీక్షల కోసం లోపలికి తీసుకెళ్లారు. కాస్త దూరంగా ఉన్న పోలీసులను చూసి దొంగ పారిపోయాడు. ‘కరోనా ఖైదీ’ కావడంతో పోలీసులు టెన్షన్ తో అతని కోసం భారీ స్థాయిలో వేట ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: