దేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఎంత దారుణంగా మారింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పిట్టాల్లా రాలిపోతున్నారు.. ఒకదశలో కరోనా పేరు చెబితే భయంతో కంపించిపోతున్నారు. చిన్న పెద్దా అనే తేడా లేదు.. ఎవ్వరికైనా ఈ వైరస్ ఇట్టే ఎటాక్ అవుతుంది.  కరోనా తో ఇప్పుడు అమెరికా పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఏకంగా 50 వేలకు పైగా మరణాలు సంబవించాయి.. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో కూడా మరణాల సంఖ్య బాగా ఉంది. ఇక మన దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దాంతో లాక్ డౌన్ విధించారు.. కానీ ఎక్కడోఅక్కడ కేసులు ప్రతిరోజూ నమోదు అవుతూనే ఉన్నాయి.

 

 

దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తర్వాత రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలో ఈ కేసుల సంఖ్యపెరుగుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తూనే ఉంది. ఓ జ‌ర్న‌లిస్టుకు క‌రోనా సోక‌డంతో అత‌న్ని క‌లిసిన న‌లుగురు మంత్రులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. ఈ జాబితాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ ఉన్నారు. ఈ నలుగురూ సోషల్ మాద్యంలో  తమ దిగ్బంధాన్ని ప్రకటించారు.

 

 ఈ నెల 21 నుంచి 24 మధ్య ఓ టీవీ ఛానల్ కు చెందిన జర్నలిస్టు వివిధ శాఖల మంత్రులను కలిశారు. వీరిలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ, హోం మంత్రి  బస్వరాజ్ బొమ్మాయి కూడా ఉండటం గమనార్హం. మిగిలిన వారిలో వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక మంత్రి రవి ఉన్నారు. వీరు నలుగురూ కరోనా టెస్టులు చేయించుకోగా... నెగెటివ్ అని తేలింది.అయినా కూడా స్వీయ నిర్బంధంలో ఉంటామని చెప్పారు.  కరోనా వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: