ఈ మధ్యకాలంలో ఏటీఎంలా  వినియోగం ఎక్కువయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్  నేపథ్యంలో చేతిలో ఉన్న డబ్బు కాస్త అయిపోవడంతో ఏటీఎంకు వెళ్లి ఎక్కువగా డబ్బు తెచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.  ఇక ఏటీఎం అన్న తర్వాత సీసీ కెమెరాలు సెన్సార్లు అంటూ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఏటీఎం దొంగిలించడానికి ఎవరైనా వచ్చారు అంటే సైరన్ మోగుతుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తూ వుంటారు. 

 

 

 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆంధ్ర బ్యాంకు ఏటీఎంలో అర్ధరాత్రి సమయంలో సైరన్ మోగింది. ఈ క్రమంలోనే స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఏటీఎం లో దొంగలు పడ్డారేమో అని భావించారు స్థానికులు. ఇక లేట్ చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలోని ఆంధ్ర బ్యాంకు ఎటిఎం లో దొంగలు పడ్డారు అంటూ ఫిర్యాదు చేశారు. ఇంకేముంది పోలీసులు హుటాహుటిన ఎటిఎం దగ్గరకు పరుగులు పెట్టారు. పోలీసులు వచ్చినప్పటికీ సైరన్  మోగుతూనే ఉంది. కానీ అక్కడ జరిగిన సంఘటన చూసి పోలీసులే అవాక్కయ్యారు. 

 

 

 ఇంతకీ ఏం జరిగింది అంటారా... ఓ బల్లి  పోలీసులకు ముచ్చెమటలు పట్టించి ఏకంగా పరుగులు పెట్టించింది. సికింద్రాబాద్ చిలకలగూడ లోని ఆంధ్ర బ్యాంకు ఎటిఎం లో అర్ధరాత్రి సమయంలో సైరన్ మోగింది. సైరన్  తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఎటిఎం దగ్గరకు పరుగులు పెట్టారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏటీఎం చెక్ చేసి చూస్తే ఏటీఎంలో డబ్బులు పోలేదు. మరి సైరన్ ఎందుకు మోగింది అంటారా... అక్కడ సెక్యూరిటీ సెన్సార్ లోకి బల్లి వెళ్ళడం  వల్ల అని తెలిసి  అందరూ షాక్ కి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: