ప్రపంచ దేశాలు మొత్తం ప్రస్తుతం కరోనా  వైరస్ పై  యుద్ధం చేస్తున్నాయి. తమ దేశం నుంచి కరోనా  వైరస్ ని తరిమికొట్టేందుకు  ప్రాణాలకు రక్షించడానికి అగ్రరాజ్యాలు సైతం పడరాని పాట్లు పడుతున్నాయి. అయినప్పటికీ మహమ్మారి కరోనా  వైరస్ విసురుతున్న పంజా కి ఎంతో మంది బలి అవుతూనే ఉన్నారు.  ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతోనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకన్నా ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కరోనా  వైరస్ విజృంభన మాత్రం కొనసాగుతూనే ఉంది. కరోనా  వైరస్ నేపథ్యంలో అన్ని దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సహాయం చేస్తూ ప్రజలను ఆదుకునే విధంగా ఎంతో మంది ప్రముఖులు భారీ మొత్తంలో విరాళాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక యువ కెరటం భారీ మొత్తంలో విరాళాన్ని అందజేసింది. ప్రముఖ స్వీడన్ యువ కెరటం  పర్యావరణవేత్త గ్రెటా తంపర్జ్  లక్ష డాలర్లు విరాళంగా అందించింది. డానిష్  ఫౌండేషన్ నుంచి తీసుకున్న మొత్తాన్ని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్  ఫండ్ కి సందర్భంగా పేర్కొంది. కరోనా వైరస్  ప్రభావం పిల్లలపై ఎంతగానో చూపిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో మరింత మంది ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... దీని కోసం పోరాటానికి ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరింది . 

 

 

 అయితే ఈ యువతి  ఇచ్చిన విరాళం పై స్పందించిన యూనిసెఫ్ లాక్ డౌన్  కారణంగా ఏర్పడిన  ఆహారం ఆరోగ్యం విద్య వంటి వాటికి ఎలాంటి కొరత రాకుండా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఈ యువతి ఇచ్చిన విరాళం పై అటు సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. మంచి మనసును చాటుకుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: