ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు  భారీగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతునే  ఉంది.దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పదుల సంఖ్యలో కర్నూలు జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి.ఈ  తరుణంలో అటు అధికారులకు మరోవైపు ప్రభుత్వానికి కూడా అక్కడ కరోనా  వైరస్ ను కంట్రోల్ చేయడం కత్తిమీద సాములా మారింది. 

 

 

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న కేసుల్లో సగానికిపైగా కేసులు  కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. రోజురోజుకు  వైరస్ కేసులు  భారీగా కర్నూలు లో పెరుగుతున్న తరుణంలో అక్కడి ప్రజలు బతుకు జీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక కరోనా  వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా కర్నూలు జిల్లాలోని ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం అక్కడ రెడ్ జోన్ గా  ప్రకటించి మరింత కఠిన నిబంధనలు ఆంక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ  ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 

 

 

 అయితే  కర్నూలు జిల్లాలో ఎంత దారుణం పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం అని చెప్పాలి. కరోనా  వైరస్ సోకిన వ్యక్తికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుకున్నారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు ఇది అమానవీయ చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత సానుభూతి చూపించాల్సింది పోయి మానవత్వం మరిచి వివక్ష చూపడం సరికాదు అంటూ సూచిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఉంటే ఎలా స్పందిస్తామో  ఇతరుల విషయంలో కూడా అలాగే స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: