పోలీసుల దగ్గర అది తెలివి చూపించి ఒక వ్యక్తి చివరికి అడ్డంగా బుక్కయ్యాడు. ఒక విషయానికి వస్తే... తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని అనారోగ్యం గురి అవడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు పిలిపించాడు. అయితే ఇందులో తన తండ్రిని పడుకోబెట్టి యువకుడు ఆయన వెంట వెళ్ళాడు. తీరా సీన్ కట్ చూస్తే... అతను పెళ్లి చేసుకొని భార్యతో తిరిగి వచ్చాడు ఆ యువకుడు. ఇలా చేసుకున్న వాడు మామూలుగా ఉంటే సరిపోయేది కానీ, పెళ్లి వేడుకల పేరుతో ధూమ్ ధామ్ నిర్వహించడంతో పోలీసులు వారికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కి చెందినది.

 


అయితే అతని వివాహం కోసం లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి అడ్డంగా బుక్కయ్యాడు పెళ్ళికొడుకు. తన పెళ్లి కోసం హైడ్రామాకు తెర తీసిన అహ్మద్ కి ఢిల్లీకి చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే సడన్ గా లాక్ డౌన్ రావడంతో పోలీసులు అత్యవసర వాహనాలు తప్పించి ఏ మిగితా ఏ వాహనాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీనితో అనుకున్న సమయానికి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో పెళ్ళికొడుకు పక్క స్కెచ్ వేశాడు.

 


తన తండ్రి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఆమెను పిలిపించుకొని అందులో తన తండ్రిని పడుకోబెట్టి ఆ వాహనంలోని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు ఆపితే తండ్రి ఆరోగ్యం బాగాలేదని చెప్పి డిల్లీ ఆసుపత్రికి తీసుకు వెళుతున్నాం అని చెప్పడంతో వారు వదిలేయడం జరిగింది. దీనితో వారు ఢిల్లీ వరకు చేరుకొని అక్కడ రెడీగా ఉన్న పెళ్లికూతురిని పెళ్లి చేసుకొని తిరిగి మళ్ళీ అదే అంబులెన్స్ లోని వారి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక తన తండ్రిని ఆంబులెన్స్ లో తీసుకెళ్లి భార్యతో తిరిగి వచ్చిన యువకుడు పెళ్లి వేడుకల పేరుతో ఇంటి దగ్గర ధూమ్ ధామ్ చేయడంతో ఇరుగుపొరుగుకి ఊహించని షాక్ ఇచ్చారు. కానీ ఎవరో ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. వారు పూర్తి వివరాలు స్వీకరించడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఇంకేముంది దీనితో ఆ కుటుంబ సభ్యులందరినీ పరీక్షల కోసమని క్వారంటైన్ సెంటర్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: