దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈరోజు కరోనా కేసుల సంఖ్య  అమాంతంగా పెరిగిపోతే కేరళ లో మాత్రం కొత్తగా కేవలం రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి అలాగే 14 మంది కోలుకున్నారు. నెల రోజుల నుండి ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య ఏరోజు 20 దాటలేదు. ఇక తాజాగా వచ్చిన 2 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 497 కు చేరగా అందులో 383మంది కోలుకున్నారు. నలుగురు మరణించారు. కాగా ప్రస్తుతం 111కేసులు మాత్రమే యాక్టీవ్ గా ఉన్నాయని సీఎం విజయన్ వెల్లడించారు.
 
'
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత వారం రోజుల నుండి  తక్కువ కేసులు నమోదవుతున్న తెలంగాణ లో ఈరోజు కొత్తగా 22 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది అలాగే ముగ్గురు మరణించారు. ఈ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1038 కు చేరగా అందులో  ప్రస్తుతం 568 కేసులు యాక్టీవ్ లో వున్నాయి. ఇప్పటివరకు 28కరోనా మరణాలు సంభవించాయి. ఇక ఆంధ్రా లో మాత్రం ఏ మార్పులేదు. ఈరోజు కూడా మరో 71 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరింది. ఇదిలావుంటే ఈఒక్క రోజే దేశ వ్యాప్తంగా కరోనా కేసులసంఖ్య 1800 దాటడం ఖాయంగా కనిపిస్తుంది. మరో మూడు రోజుల్లో రెండో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: