కరోనా వైరస్ ని భూమిమీదనుండి పూర్తిగా తొలగించడానికి శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టడానికి రాత్రింబవళ్లు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం 200 దేశాలకు పైగా నే విస్తరించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. చాలావరకు యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికా దేశంలో ఈ వైరస్ వల్ల ఆర్ధిక నష్టం రికార్డు స్థాయిలో నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అంతేకాకుండా పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో చైనా శాస్త్రవేత్తలు కరోనా కి ' చావు ' లేదు అన్న కబురు చాలా చల్లగా చెప్పారు. 2002వ సంవత్సరంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన SARS) వైరస్ మాదిరిగా ఈ వైరస్ అంతమైపోయేది కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్తులో జ్వరం లాంటి లక్షణాలు కనిపించకుండా నే మనిషి శరీరంలో ప్రవేశించి బలపడిపోయి, చివరిదశలో బయటపడుతుందని, అప్పటికే సదరు వ్యక్తి వల్ల అనేక నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

 

ఇక మనిషి జీవితంలో కరోనా వైరస్ కూడా ఒక భాగమైపోయింది అని వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో గుర్తించలేమని చైనీస్ వైరల్ గ్రూపు మెడికల్ రీసెర్చర్లు వెల్లడించారు. ఏదిఏమైనా ఈ వైరస్ కి వ్యాక్సిన్ మార్గం ఒకటే కరెక్ట్ అని అప్పటివరకు మనుషులు  అప్రమత్తంగా ఉండాలని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాతజిన్ బయోలజీ (Institute of Pathogen Biology) తెలిపింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple. 

మరింత సమాచారం తెలుసుకోండి: