ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా...ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్సలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఉమా, ఇష్టమొచ్చినట్లు మీడియా సమావేశం పెట్టడం, జగన్ పై విమర్సలు చేయడం చేస్తున్నారు.

 

తాజాగా కూడా ఉమా మాట్లాడుతూ... ఇప్పటివరకు ఎన్ని లక్షల టన్నుల ధాన్యం కొన్నారో ప్రభుత్వం చెప్పాలని, గతంలో ప్రభుత్వం కొన్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. 75 కిలోల ధాన్యం అమ్మాలంటే 15 కిలోల తరుగు తీస్తున్నారని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు.

 

అయితే అసలు మేటర్ తెలియక ఉమా ఆవేశపడుతూ ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ ప్రభుత్వంపై విమర్సలు గుప్పించేశారు. అసలు జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. దళారి వ్యవస్థకు చెక్ పెడుతూ, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రోజుకు 60వేల టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొంటున్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ, సమయానికి ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఎకౌంటుల్లో వేస్తున్నారు. ఇక 75 కిలోల ధాన్యానికి 15 కిలోల తరుగు తీస్తున్నారనేది పూర్తి అబద్ధం. అలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఇక తడి ధాన్యం కొనుగోలుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

 

కాకపోతే తడి ధాన్యం కొనుగోలు చేయాలంటే కేంద్రం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. వాటి కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే తడి ధాన్యం కూడా కొనుగోలు చేసే అవకాశముంది.  అయితే ఏపీ ప్రభుత్వం తీసుకునే చర్యలు తెలుసుకోకుండా ఉమా ఆవేశపడిపోయి, మీడియా ముందు ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: