చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు. అసలు జగన్ ఏ కార్యక్రమం చేసిన, ఏ పథకం అమలు చేసిన వాటిపై బాబు అండ్ బ్యాచ్ విమర్సలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం కరోనా వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా జగన్ ప్రజలని ఆదుకుంటూనే ఉన్నారు. ఓ వైపు కరోనాని కట్టడి చేయడానికి కృషి చేస్తూనే, మరోవైపు ప్రజలను ఆదుకుంటూ, వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.

 

ఇక ఇదేమి అర్ధం చేసుకొని బాబు, కరోనాని కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు. తాజాగా కుల రాజకీయం కూడా మొదలుపెట్టారు. బీసీ నిధులని కొట్టేసి, జగన్ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి నిధులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బీసీ కార్పొరేషన్ డబ్బులు  వాడుకున్నారో అందరికీ తెలుసని వైసీపీ నేతలు అంటున్నారు.  ఇక బీసీల లోన్లలో టీడీపీ నేతలు ఎంత కమిషన్లు నొక్కేసారో కూడా తెలుసని చెబుతున్నారు.

 

ఇదే సమయంలో ఇలాంటి విపత్కర సమయంలో జగన్, బీసీలని మరిచిపోకుండా వారికి ప్రత్యేక సాయం కేసుల చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న కల్లుగీత కార్మికులకు ఊరట కలిగించేలా, వారికి కల్లుగీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని, దాని వల్ల లక్షా 20 వేల గీతకార్మికుల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని అంటున్నారు.

 

అదేవిధంగా గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేలకు పైనే మత్స్యకారులని సొంత రాష్ట్రానికి తీసుకొస్తున్నారని, అలాగే వారికి రూ..2 వేలు సాయం చేయనున్నారని, ఇంకా మే 6న మత్య్సకార కుటుంబాలకు రూ.10 వేలు సాయం కూడా అందించనున్నారని చెబుతున్నారు. ఇంకా మే 4 తరువాత బీసీల్లో పలు కులాల వారికి తమ తమ వృత్తులను చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారని వివరిస్తున్నారు. మొత్తం మీద విపత్కర సమయంలో కూడా జగన్ బీసీలకు అండగా ఉంటున్నారని, కానీ చంద్రబాబు మాత్రం బీసీలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: