కరోనా వైరస్ కట్టడి చేయటానికి యూరప్ దేశాలు మరియు అమెరికా దేశాలకు చెందిన నాయకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైరస్ ని కంట్రోల్ చేయలేక అనేక అవస్థలు పడుతున్నారు. చాలావరకు ప్రాణ మరియు ఆర్థిక నష్టాలు యూరప్ మరియు అమెరికా దేశాల్లోనే ఎక్కువగా జరిగింది. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడటమే కాక పేద వారు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ఇండియాలో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. వేసవి కాలం ఉన్నాగాని ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నా కానీ కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. మొదటి దశ లాక్ డౌన్ లోనే దాదాపు కరోనా వైరస్ ని కంట్రోల్ లో పెట్టవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ మత ప్రార్థనల ఎఫెక్ట్ పడటంతో దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో మాత్రం కొన్ని దేశాలలో టోటల్ కంట్రోల్ లోకి వచ్చేసింది. ఆ దేశాల పేర్లు ఒకసారి గమనిస్తే న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా - చైనా - ఫ్రాన్స్. మొదటిలో ఈ దేశాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే విదేశాలలో పదికి మించి కూడా కరోనా కేసులు నమోదు కాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

ఈ నాలుగు దేశాలలో వైరస్ కంట్రోల్ అవడానికి గల కారణం గురించి అంతర్జాతీయ స్థాయిలో వినబడుతున్న వార్త ఏమిటంటే… లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయడం. అదే రీతిలో ఆ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా సహకరించడం. ఇందువల్లనే ఈ దేశాలలో కరోనా వైరస్ టోటల్ కంట్రోల్ లోకి వచ్చిందని సమాచారం.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple. 

మరింత సమాచారం తెలుసుకోండి: